‘అమెజాన్‌ సీఈఓ ఒక కాపీ క్యాట్‌’

Tesla CEO Elon Musk Calls Jeff Bezos 'Copy Cat' - Sakshi

టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్  ట్విట్టర్‌లో అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈఓ జెఫ్ బెజోస్‌ను ‘కాపీ క్యాట్’ అని విమర్శించారు. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ సెల్ఫ్ డ్రైవింగ్-టాక్సీ కంపెనీ జూక్స్‌ను 1.2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈ నెల ప్రారంభంలో, అమెజాన్ సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ కంపెనీ జుక్స్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా కొత్త వ్యాపారంలోకి ఈ- కామర్స్‌ దిగ్గజం అడుగుపెడుతోంది. కస్టమర్లు ఫోన్‌ చేసి వాహనాన్ని అడిగే వారి కోసం సెల్ఫ్‌ డ్రైవిగ్‌ వాహనాన్ని అమెజాన్‌ ఇకపై అందించనుంది. డ్రైవర్‌ లేకుండానే ఈ వాహనం పనిచేస్తోంది. కొత్త ఒప్పందం ప్రకారం అమెజాన్‌, సెల్ఫ్ డ్రైవింగ్  రంగంలో టెస్లాతో పోటీపడుతున్న నేపథ్యంలో మస్క్ ట్విట్టర్ ద్వారా బెజోస్‌ను  విమర్శించారు. 

(మద్యం హోం డెలివరీకి గ్రీన్‌సిగ్నల్‌‌..)

మస్క్‌, బెజోస్‌ను విమర్శించడం ఇదే మొదటిసారి ఏం కాదు, ఈ నెల ప్రారంభంలో  టెస్లా సీఈఓ బ్లూ ఆరిజిన్,  బెజోస్‌పై ఘూటు విమర్శలు చేశారు. ‘ఈ-కామర్స్ దిగ్గజాన్ని బ్రేక్‌ చేసి‌, దాని గుత్తాధిపత్యాన్ని అంతం చేయాల్సిన సమయం ఆసన్నమైంది’ అని మస్క్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.నివేదికల ప్రకారం, టెస్లా, జూక్స్ కలిసి ఇంతకు ముందు వర్తకం చేశాయి. 2020 మధ్యలో నాటికి తమ సంస్థ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు మనిషి అవసరం లేకుండా  పూర్తి స్థాయిలో పనిచేస్తాయని మస్క్ చెప్పారు. ఈ విషయంపై స‍్పందించిన  జూక్స్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ జెస్సీ లెవిన్సన్ అది జరిగే అవకాశం లేదని చెప్పారు. లెవిన్సన్ మాట్లాడుతూ, టెస్లాకు డ్రైవర్లు లేకుండా వెళ్ళడానికి తగినంత సెన్సార్లు, కంప్యూటర్లు లేవు అని తెలిపారు. 

(కోల్‌కతా వ్యక్తికి షాకిచ్చిన అమెజాన్‌)

లెవిన్సన్ టెస్లా కార్లను ‘గొప్ప’ అని అంగీకరించినప్పటికీ,  కంపెనీ ఆటోపైలట్ ఫీచర్, దాని పూర్తి-సెల్ఫ్ డ్రైవింగ్ ఎంపికలలో కూడా ఇంకా పూర్తిగా స్వయంప్రతిపత్తిని కలిగి లేదన్నారు. టెస్లా వ్యవస్థకు ఇప్పటికీ డ్రైవింగ్‌ విషయంలో మనుషులు అవసరమని లెవిన్సన్ తెలిపారు. జూక్స్ కరోనా మహమ్మారి కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంది.  నివేదికల ప్రకారం, ఈ కంపెనీ ఏప్రిల్‌లో దాదాపు 120 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. (అభిమానికి కౌంటరిచ్చిన అమెజాన్‌ సీఈఓ)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top