
కాబూల్ : ఆప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ నగరం ఒక్కసారిగా బాంబులతో దద్దరిల్లింది. అమెరికా ఎంబసీకి దగ్గర్లో కారు బాంబుతో ఉగ్రవాదులు పేలుళ్లకు తెగబడ్డారు. ఆ తర్వాత రద్దీగా ఉన్న ప్రదేశాలను లక్ష్యంగా చేసుకొని కాల్పులు ప్రారంభించారు.ఈ ఘటనలో 34 మంది మృతి చెందగా, 65 మందికి పైగా గాయపడ్డారు. రక్షణ మంత్రిత్వ శాఖ భవన సముదాయాలకు దగ్గరలోనే ఈ బాంబులు అమర్చడం గమనార్హం. దీంతో అక్కడ భద్రత కట్టుదిట్టం చేసినట్లు పోలీసులు తెలిపారు. అదే విధంగా ఉగ్రవాదుల జాడ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.