కరాచీలోని స్టాక్‌మార్కెట్‌పై ఉగ్రదాడి

Terrorist Attack On Pakistan Stock Exchange Building - Sakshi

కరాచీ : పాకిస్తాన్‌లోని స్టాక్‌మార్కెట్‌పై సోమవారం ఉదయం ఉగ్రవాదులు దాడికి దిగారు. ఈ దాడిలో ఇద్దరు పౌరులు, ముగ్గరు ఉగ్రవాదులు మృతి చెందగా, పలువురికి తీవ్రగాయాలు అయినట్లు సమాచారం. పాకిస్తాన్‌ మీడియా కథనాల ప్రకారం.. సోమవారం ఉదయం కరాచీలోని స్టాక్‌మార్కెట్‌ భవనంలోకి నలుగురు ఉగ్రవాదులు చొరబడి, విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఉగ్రదాడితో అప్రమత్తమమైన భద్రతా బలగాలు ప్రతిదాడిచేసి ముగ్గుర్ని హతమార్చాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భవనంలోని సిబ్బందిని అధికారులు ఖాళీ చేయించారు.



దాడిలో పలువురికి గాయాలైనట్లు పాక్ మీడియా తెలిపింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందగా.. వీరిలో ముగ్గురు ఉగ్రవాదులేనని పేర్కొంది. ఉగ్రదాడి జరిగిన ప్రాంతాల్లో బ్యాంకులు, పలు ప్రయివేట్ సంస్థల కార్యాలయాలు ఉన్నాయి. దీంతో భద్రతా దళాలు మరింత అప్రమత్తమయ్యాయి. ఆ ప్రాంతంలో ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు ఉన్నారేమోనన్న అనుమానంతో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినట్టు సైనిక, అధికార వర్గాలు వెల్లడించాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top