బస్సుకు మంటలు: పదిమంది మృతి | ten dead as bus catches fire in south korea | Sakshi
Sakshi News home page

బస్సుకు మంటలు: పదిమంది మృతి

Oct 15 2016 8:42 AM | Updated on Sep 4 2017 5:19 PM

బస్సుకు మంటలు: పదిమంది మృతి

బస్సుకు మంటలు: పదిమంది మృతి

దక్షిణ కొరియాలోని ఉల్సాన్ నగరంలో బస్సుకు మంటలు అంటుకున్న ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు మరణించారు.

దక్షిణ కొరియాలోని ఉల్సాన్ నగరంలో బస్సుకు మంటలు అంటుకున్న ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. 20 మంది ప్రయాణిస్తున్న ఈ బస్సు ముందుటైర్లు పేలిపోవడంతో అది డివైడర్‌కు ఢీకొని మంటలు చెలరేగాయి. ఉన్నట్టుండి మంటలు రావడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ప్రయాణికులు చిక్కుకుపోయారు.

బయటకు వచ్చేందుకు ప్రయత్నించేలోపే మంటలు బాగా వ్యాపించాయి. దాంతో పదిమంది లోపలే మరణించారు. మరో ఏడుగురికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు ముగ్గురు మాత్రం దీన్నుంచి బయటపడ్డారని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.

(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement