#మీటూ దెబ్బకు జంకుతున్న ఆఫీసులు

A Study Says Workplace Romance Has Become Less Acceptable After MeToo Movement - Sakshi

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీటూ ఉద్యమం.. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మహిళలకు గొంతుకగా నిలిచింది. ఈ మూవ్‌మెంట్‌తో ఎంతో మంది సెలబ్రిటీల చీకటి వ్యవహారాలు వెలుగు చూశాయి. అన్ని రంగాల్లోని మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి తమ చేదు అనుభవాలను ప్రపంచానికి తెలియజేశారు. అయితే ఈ మీటూ దెబ్బకు ప్రధాన కార్యాలయాలన్నీ వణికిపోతున్నాయని ఓ స్టడీలో వెల్లడైంది. తమ కార్యాలయాల్లో  ఉద్యోగులు రొమాన్స్‌ చేయడానికి వీల్లేదని స్పష్టం చేస్తున్నాయని ఆ స్టడీ పేర్కొంది.

సుమారు 80 మంది హెచ్‌ఆర్‌ ఉద్యోగులు తమ కార్యాలయాల్లో ఉద్యోగుల ప్రేమ వ్యవహారాలను అనుమతించడం చాలా వరకు తగ్గించినట్లు పేర్కొన్నారని వెల్లడించింది. అంతే కాకుండా యూకేలో సుమారు 20 సంస్థలు.. ఇలాంటి వ్యవహారాలపై పూర్తిగా నిషేధం కూడా విధించాయని, 78 శాతం కంపెనీలు.. ఉద్యోగుల సంబంధాల అంశంలో ఉన్న నియమ నిబంధనలను పున:సమీక్షించి మార్చాయని కూడా పేర్కొంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top