
ఎనభైల్లోనూ తళుకులీనే అందం...
తళుకులీనే అందం... అర్థ శతాబ్ది దాటినా ప్రఖ్యాతి తగ్గని రూపం..
తళుకులీనే అందం... అర్థ శతాబ్ది దాటినా ప్రఖ్యాతి తగ్గని రూపం.. గోల్డ్ ఫింగర్ బాండ్ గర్ల్ షిల్లీ ఈటన్... ఇప్పుడు మరోసారి అభిమానులముందు బంగారు బొమ్మలా ప్రత్యక్షమైంది. ఎనభై ఏళ్ళకు చేరుతున్నా... అదే ఆత్మవిశ్వాసంతో ఉన్న ఆమె... గ్లామర్ కు వయసుతో సంబంధం లేదంటోంది. అప్పట్లో గోల్డ్ ఫింగర్ సినిమాలో తన పాత్రకోసం బంగారు రంగులో కనిపించిన ఆ గ్లామర్ క్వీన్... ఇప్పుడు ప్రత్యేక ఫొటో షూట్ లో బంగారు శిల్పంగామారి.. మరోసారి తన అనుభవాలను నెమరువేసుకుంది.
78ఏళ్ళ మిస్ ఈటన్... గోల్డ్ పింగ్మెంట్ పౌడర్ ను ఒళ్ళంతా పూసుకొని.. హొయలొలికించే సౌందర్య లావణ్యాన్ని ప్రదర్శిస్తూ రెండు గంటలపాటు ఫొటో షూట్ కు హాజరైంది. 1964 లో గోల్ఢ్ పింగర్ సినిమా చిత్రీకరణ సమయంలో ఈటన్ కు 27 ఏళ్ళ వయసు. అప్పట్లో ప్రముఖ ఇంగ్లీషు పత్రిక లైఫ్ కవర్ పేజ్ పై తళుకులీనే అందాలను ప్రదర్శించిన ఈటన్.. ఇప్పుడు మరోసారి అదే పోజులో దర్శనమిచ్చింది. ఒంటిపై వస్త్రాలు సైతం లేకుండా మరోసారి బంగారు రంగు పూతను వేసుకొని వివిధ భంగిమల్లో కనిపించింది. '' నాకు ఛాలెంజింగ్ గా ఉండటం అంటే ఎంతో ఇష్టం.
అందుకే వృద్ధాప్యంలోనూ వినోదాన్ని పంచేందుకు ప్రయత్నించాను'' అంటుంది ఈటన్. జరిగిన ఏభై ఏళ్ళలో పలుమార్లు.. ప్రముఖ పత్రికలు తనను పోజులకోసం అడిగాయని, కానీ తాను దానికి అంగీకరించలేదని అంటుందీ బాండ్ లేడీగా మారిన బాండ్ గర్ల్... వచ్చే జనవరిలో తన 79వ పుట్టిన రోజని, వయసువల్ల శరీరానికి ముడతలు వచ్చినా.. ఆత్మ విశ్వాసంలో ఎటువంటి మార్పు లేదని చెప్తుందీ బంగారు బొమ్మ. నటీమణులను కళా దృష్టితోనే చూడాలని, వారిని కించపరిచేందుకు ప్రయత్నించకూడదని సూచిస్తున్న ఈ ఓల్డేజ్ సౌందర్యరాసి.. కొత్తగా వచ్చే సినిమాల్లో విమర్శలకు గురౌతున్న బాండ్ గాల్స్ కు మనో ధైర్యం కలిగించేందుకు, స్ఫూర్తిగా నిలిచేందుకు తాను మరోసారి ఈ రూపంలో దర్శనమిచ్చినట్లు ఈటన్ చెప్తోంది.