లొల్లికొస్తారా..? 

Scolding Your Enemy By Technology Using App - Sakshi

కూలీకొస్తారా.. అనగా విన్నాం.. పని ఉంది చేయడానికి వస్తారా అని అడగ్గా విన్నాం.. ఈ మధ్య బజార్‌ కొస్తారా.. అని కూడా చూశాం.. కానీ కొత్తగా లొల్లికొస్తారా ఏంటి అని అనుకుంటున్నారా..? ఇదే కదా మీ డౌట్‌. అవును చైనాలో అలాగే అడుగుతారు మరి. మిమ్మల్ని ఎవరైనా ఏడిపించారనుకోండి.. టీజ్‌ చేశారనుకోండి.. లేదంటే ఎక్కడైనా గొడవకు దిగారనుకోండి. అప్పుడు మీరు సరిగ్గా మాట్లాడలేకపోతే.. అందులో పైచేయి సాధించలేకపోతే.. మీ వద్ద అప్పుడు రెండే ఆప్షన్లు ఉంటాయి. ఒకటి.. నోరు మూసుకుని చక్కగా వెనక్కి వచ్చేయడం లేదంటే.. గొడవ పడిన వారితో మీరు అనవసరంగా తిట్లు పడాల్సి రావడం. కానీ చైనాలో ఓ ఆన్‌లైన్‌ కంపెనీ దీనికి కూడా పరిష్కారం వెతికి పెట్టిందండోయ్‌. టావోబావో అనే కంపెనీ మీ తరఫున గొడవ పడేందుకు వేరే వారిని నియమించుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. అది కూడా చాలా ప్రొఫెషనల్‌గా గొడవ పడేవారిని మీకు ఆన్‌లైన్‌లో చూపిస్తుంది.

టావోబావో ప్రపంచంలోనే అతిపెద్ద ఈ–కామర్స్‌ సంస్థ. తాజాగా గొడవలు పెట్టుకునేవారిని కూడా ఆన్‌లైన్‌ ఆర్డర్‌ ఇచ్చేలా ఏర్పాట్లు చేసింది. మీరు ఏ విషయంలో గొడవపడుతున్నారు..? ఎవరితో గొడవపడుతున్నారు..? మీరు నియమించుకునే వారు ఎలా గొడవ పడాలి.. ఎదుటి వారిని ఏ మాటలు అనాలి..? ఎంత సేపు గొడవ పడాలి.. ఇలా అన్ని వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపరిస్తే అందుకు తగ్గట్లు సాయం చేస్తారన్న మాట. ఇందుకోసం కొంత డబ్బు వసూలు చేస్తుంది. అయితే గొడవ పడే వారిని నేరుగా మనదగ్గరికి పంపించరు. కేవలం ఫోన్‌ లేదా మెస్సేజీల ద్వారా మనతో గొడవ పడినవారిని తిరిగి తిట్టేలా ఏర్పాటు చేస్తోంది. గంటకు కేవలం రూ.220 వసూలు చేస్తోంది.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top