విమానాన్ని వెనక్కు రప్పించిన ఎలుక | Rat grounds Chinese plane | Sakshi
Sakshi News home page

విమానాన్ని వెనక్కు రప్పించిన ఎలుక

Feb 26 2016 6:41 PM | Updated on Sep 3 2017 6:29 PM

విమానాన్ని వెనక్కు రప్పించిన ఎలుక

విమానాన్ని వెనక్కు రప్పించిన ఎలుక

ఎలుక విమానాన్ని వెనక్కి రప్పించిన ఘటన మరోసారి చోటు చేసుకుంది.

బీజింగ్: ఎలుక విమానాన్ని వెనక్కి రప్పించిన ఘటన మరోసారి చోటు చేసుకుంది. చైనాలో ఆకాశ మార్గంలో వెళ్తున్నప్పుడు విమానంలో ఎలుక కనిపించడంతో వెంటనే వెనక్కు దారి మళ్లించి ల్యాండ్ చేశారు.

శుక్రవారం హాంగ్‌జౌ నగరం నుంచి యునాన్ ప్రాంత పరిధిలోని జిషువాంగ్‌బనాకు లూంగ్ ఎయిర్ ఫ్లైట్ బయల్దేరిన కాపేపటికి క్యాబిన్ లో ఎలుక కనిపించింది. దీంతో విమానాన్ని వెనక్కి మళ్లించారు. విమానాన్ని ల్యాండ్ చేసిన తర్వాత ఎలుకను పట్టుకునేందుకు గాలించారు. విమానంలో ప్రయాణికులకు అసౌకర్యం కలిగించడంతో పాటు ఎలక్ట్రిక్ వైర్లను కొరకడం వల్ల ప్రమాదం జరిగే అవకాశముంది. ఈ ఉదంతంపై  లూంగ్ ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధులు మాట్లాడుతూ.. ఎలుక విమానంలోకి ఎలా వచ్చిందో తమకు అర్థం కావడం లేదని చెప్పారు. భోజనం సరఫరా చేసే వారి ద్వారా ఎలుక వచ్చి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. లూంగ్ ఎయిర్‌లైన్స్‌ 50కి పైగా దేశవాళీ రూట్లలో సర్వీసులు నడపుతోంది. ఎలుక కారణంగా విమానం వెనుకకు వచ్చిన సంఘటనలు గతంలో పలుమార్లు జరిగాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement