ఆకలేస్తుందని హోటల్‌లో హెలికాప్టర్‌ దించాడు | Pilot Lands Helicopter At McDonald's | Sakshi
Sakshi News home page

ఆకలేస్తుందని హోటల్‌లో హెలికాప్టర్‌ దించాడు

May 15 2017 12:01 PM | Updated on Sep 5 2017 11:13 AM

ఆకలేస్తుందని హోటల్‌లో హెలికాప్టర్‌ దించాడు

ఆకలేస్తుందని హోటల్‌లో హెలికాప్టర్‌ దించాడు

ఆకలితో వచ్చి తమ హోటల్‌లో హెలికాప్టర్‌ దించిన ఓ కస్టమర్‌ను చూసి మెక్‌ డోనాల్డ్‌ సిబ్బంది కాసేపు అవాక్కయ్యారు.

సిడ్నీ: బాగా ఆకలేస్తే సాధారణంగా ఏం చేస్తాం.. అందుబాటులో ఉన్న ఏ హోటల్‌కో లేదంటే రోడ్డు పక్కన ఉండే బండి వద్దకో వెళ్లి ముందు ఆ బాధ తీర్చేసుకుంటాం. అలా మనం వెళ్లినప్పుడు ఏ హోటల్‌ వ్యక్తి కూడా మనల్ని చూసి, అవాక్కవడం షాకవడం లాంటివి జరగదు. కానీ, ఆస్ట్రేలియాలోని సిడ్నీలో తమ హోటల్‌కు ఆకలితో వచ్చిన ఓ కస్టమర్‌ను చూసి మెక్‌ డోనాల్డ్‌ సిబ్బంది కాసేపు అవాక్కయ్యారు. షాక్‌లోకి వెళ్లిన వారు తేరుకొని అనంతరం అతడికి ఏం కావాలో ఇచ్చి పంపించారు.

ఇంతకీ మెక్‌డోనాల్డ్‌ సిబ్బంది షాక్‌ తినడానికి గల కారణం ఏమిటంటే ఆ వచ్చిన వ్యక్తి మాములుగా రాలేదు.. ఏకంగా హెలికాప్టర్‌ వేసుకొని వచ్చాడు. హోటల్‌ ముందు ఉన్న ల్యాన్‌లోకి ఏకంగా తన హెలికాప్టర్‌ను దించి అలాగే, ఇంజిన్‌ ఆన్‌లో ఉంచి ఏం చక్కా లోపలికి నడుచుకుంటూ వెళ్లి తనకు కావాల్సిన ఆహారం పార్సిల్‌ తీసుకొని వెళ్లాడు. వెళుతూ తను ఆ హోటల్‌కు వచ్చిన సందర్భంగా తన చాపర్‌ను కూడా ఓ ఫొటో తీసుకుని అనంతరం దర్జాగా ఆ హెలికాప్టర్‌ వేసుకొని వెళ్లిపోయాడు. ఆ సమయంలో ఆ పైలట్‌ను చూసిన వారంతా కూడా తీవ్ర ఆశ్చర్యానికి లోనయ్యారు. సెల్‌ఫోన్‌లో చిత్రించిన ఈ వీడియో ఇప్పుడు ఆన్‌లైన్లో తెగ వైరల్‌ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement