విమానంలో వ‌ర్షం.. ఎప్పుడైనా చూశారా? | Passengers On Russian Flight Hold Up Umbrellas Video Goes Viral | Sakshi
Sakshi News home page

విమానంలో వ‌ర్షం.. ఎప్పుడైనా చూశారా?

Jul 13 2020 4:51 PM | Updated on Jul 13 2020 6:01 PM

Passengers On Russian Flight Hold Up Umbrellas Video Goes Viral  - Sakshi

మాస్కో :  విమానంలో వ‌ర్షం కురిసే సంఘ‌ట‌నల్ని మ‌నం ఊహిస్తామా? విమానంలో వ‌ర్షం రావ‌డ‌మేంటి అనుకుంటున్నారా? రష్యా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో ఇలాంటి ఘ‌టనే చోటుచేసుకుంది. ఖబరోవ్స్క్ నుంచి నల్ల సముద్రానికి వెళ్లి హాలీడేస్ ఎంజాయ్ చేయాలనుకున్న పలువురు ఔత్సాహికులు విమానంలో బయలు దేరారు. విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే వాన కురవడం మొదలైంది. విమానం క్యాబిన్ లోకి వర్షపు నీరు చేరిపోయింది. దీంతో ప‌లువురు ప్ర‌యాణికులు విమానంలో గొడుగులు ప‌ట్టుకొని కూర్చోవాల్సి వ‌చ్చింది. దీనికి సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది. దీనిపై స్పందించిన రోసియా ఎయిర్ లైన్స్ అధికారులు విచార‌ణ జ‌ర‌ప‌గా అది వ‌ర్షం నీరు కాద‌ని పేర్కొన్నారు. ఎయిర్ కండిష‌నింగ్ వ్యవస్థ స‌రిగా ప‌నిచేయ‌క‌పోవ‌డం వ‌ల్లే నీరు క్యాబిన్‌లోకి చేరింద‌ని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement