భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీని చంపుతామంటూ హెచ్చరికలు జారీచేసిన ఉగ్రవాది తోకముడిచాడు.
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీని చంపుతామంటూ హెచ్చరికలు జారీచేసిన ఉగ్రవాది తోకముడిచాడు. వాఘా సరిహద్దుల వద్ద ఆత్మాహుతి దాడి జరిపి, దాదాపు 61 మంది ప్రాణాలను బలిగొన్న సంఘటనకు తామే బాధ్యులమని చెప్పుకొన్న తెహరిక్ ఎ తాలిబన్ పాకిస్థాన్కు అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న ఎహసానుల్లా ఎహసాన్.. తాజాగా తన ట్విట్టర్ ఖాతాను మూసేశాడు.
వాఘా పని అయిపోయిందని, ఇక తమ తదుపరి లక్ష్యం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీయేనని ట్విట్టర్ వేదికగా ఎహసానుల్లా ఎహసాన్ గతంలో హెచ్చరికలు చేశాడు. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి తన ట్విట్టర్ అకౌంట్ను అతడు మూసేశాడు.