శక్తిమంతమైన సూపర్‌ కంప్యూటర్‌ ‘సమ్మిట్‌’

ORNL launches Summit Supercomputer - Sakshi

వాషింగ్టన్‌: ప్రపంచంలో సాంకేతికంగా అత్యంత శక్తిమంతమైన సూపర్‌ కంప్యూటర్‌ను అమెరికా శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ఈ కంప్యూటర్‌ సెకన్‌కు 2 లక్షల ట్రిలియన్‌ గణనలను చేస్తుందని తెలిపారు. ఇంధన రంగం, కృత్రిమ మేధస్సు వంటి రంగాల్లో మరింత పరిశోధనలకు ఈ సూపర్‌ కంప్యూటర్‌ విప్లవాత్మక మార్పులు తెస్తుందని వెల్లడించారు. ఈ సూపర్‌ కంప్యూటర్‌ పేరు ‘సమ్మిట్‌’. ఇప్పటివరకు సూపర్‌ కంప్యూటర్‌గా ఉన్న టైటాన్‌ కంటే సమ్మిట్‌ ఎనిమిది రెట్లు శక్తిమంతమైనదని దీనిని అభివృద్ధి చేసిన యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎనర్జీకి చెందిన ఓక్‌ రిడ్జ్‌ నేషనల్‌ ల్యాబొరేటరీ వెల్లడించింది. కొన్ని రకాల పరిశోధన విభాగాల్లో సెకన్‌కు మూడు బిలియన్‌ బిలియన్ల మిశ్రమ గణనలను కూడా చేయగలగడం దీని ప్రత్యేకత.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top