బ్రిటన్‌లో లక్ష వరకు‍ కరోనా మృతులు | Sakshi
Sakshi News home page

బ్రిటన్‌లో లక్ష వరకు‍ కరోనా మృతులు

Published Mon, Apr 27 2020 1:56 PM

One Lakh Could Deaths In Britain With Novel Corona Virus - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ వల్ల బ్రిటన్‌లో ఈ ఏడాది చివరి నాటికి లక్ష మంది ప్రజలు చనిపోతారని ‘ది ఇంపీరియల్‌ కాలేజ్‌’ ఎపిడిమియాలోజిస్ట్‌ ప్రొఫెసర్‌ నీల్‌ ఫెర్గూసన్‌ అంచనా వేశారు. ఆగస్ట్‌ నెల నాటికే దేశంలో కరోనా మతుల సంఖ్య 60 వేలకు చేరుకుంటుందని స్వీడన్‌ ఎపిడిమియాలోజిస్ట్‌ జొహాన్‌ గీసెక్స్‌ అంచనా వేశారు. బ్రిటన్‌లో లాక్‌డౌన్‌ను అమలు చేయడం ద్వారా దారుణ పరిస్థితి నుంచి త్వరగా బయటపడవచ్చని ముందుగా ప్రభుత్వానికి సూచించినదే ఫెర్గూసన్‌. వ్యాక్సిన్‌ను కనుగొనే వరకు లాక్‌డౌన్‌ కొనసాగించడం మంచిదంటూ ఆయన చేసిన సూచనను దేశ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌ స్ఫూర్తిగా తీసుకొని లాక్‌డౌన్‌ ప్రకటించారు. ప్రధానికి కూడా వైరస్‌ సోకడంతో ఆయన కూడా 14 రోజులపాటు ఏకాంతవాసానికెళ్లి సురక్షితంగా బయటకు వచ్చారు.

వద్ధులను, పిలలను ఇంటికే పరిమితం చేసి యువతకు విధులకు పంపించడం ద్వారా లాక్‌డౌన్‌ను కొనసాగించడం మంచిదని ఫెర్గూసన్‌ చెప్పారు. అలా చేయడం ద్వారా 80 శాతం జనాభా ఇంటికి పరమితం అవడం, 20 శాతం  మంది మాత్రమే విధులకు హాజరవడం వల్ల మతుల సంఖ్య ఈ ఏడాది చివరి నాటికి లక్షకు చేరుకంటుందని ఆయన అన్నారు. అప్పటికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే 2021 వరకు వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం లేదని బ్రిటన్‌ విదేశాంగ మంత్రి డొమినిక్‌ రాబ్‌ చెప్పారు. (ఆ దేశంలో భారతీయుల మరణాలు ఎక్కువ!)

Advertisement

తప్పక చదవండి

Advertisement