అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కొలువులో మరో భారతీయుడికి గౌరవం దక్కింది.
జాతీయ సైన్స్ బోర్డు సభ్యుడిగా సేతురామన్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కొలువులో మరో భారతీయుడికి గౌరవం దక్కింది. భారత-అమెరికన్ శాస్త్రవేత్త సేతురామన్ పంచనాథన్ అమెరికా జాతీయ సైన్స్ ఫౌండేషన్‌లో కీలక స్థానానికి ఎంపికయ్యారు. ఆయన్ను ప్రఖ్యాత జాతీయ సైన్స్ బోర్డు సభ్యుడిగా నియమించారు. సేతురామన్ మద్రాస్ యూనివర్సిటీ వివేకానంద కాలేజీ నుంచి 1981లో భౌతికశాస్త్రంలో పట్టా పొందారు. ఐఐటీలో ఎంటెక్ చేసి చెన్నైలోని ఇంటర్నేషనల్ సాఫ్ట్‌వేర్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో డేటా కమ్యూనికేషన్ ఇంజనీర్‌గా పనిచేశారు.