ఎలుకలు, బొద్దింకల్లో జీపీఎస్! | New study reveals rats and cockroaches are wired with GPS | Sakshi
Sakshi News home page

ఎలుకలు, బొద్దింకల్లో జీపీఎస్!

Jul 11 2016 1:40 PM | Updated on Sep 4 2017 4:37 AM

ఎలుకలు, బొద్దింకల్లో జీపీఎస్!

ఎలుకలు, బొద్దింకల్లో జీపీఎస్!

కొత్త పరిసరాలను కనుక్కోవడానికి ఎలుకలు, బొద్దింకలు తమ మెదళ్లలో ఉన్న జీపీఎస్ వంటి విధానాన్ని ఉపయోగిస్తాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

వాషింగ్టన్: కొత్త పరిసరాలను కనుక్కోవడానికి ఎలుకలు, బొద్దింకలు తమ మెదళ్లలో ఉన్న గ్లోబల్ పొషిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) వంటి విధానాన్ని ఉపయోగిస్తాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. మానవులలాగే వివిధ జంతువులు కూడా ఈ పద్ధతిని వినియోగిస్తున్నాయని పరిశోధకులు తెలిపారు.

బొద్దింకలు తమని తాము ఎలా నావిగేట్ చేసుకుంటాయన్న దానిపై శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. క్షీరదాలు కొత్త ప్రాంతానికి వెళ్లినపుడు, ఏ దిశలో వెళ్లాలో తెలియక చుట్టూ మార్గాన్ని వెతుక్కుంటాయనని అమెరికాలోని కేస్ వెస్టర్న్ రిజర్వ్ వర్సిటీ ప్రొఫెసర్ రాయ్ రిజ్మన్ తెలిపారు. మానవుడితోపాటు క్షీరదాలన్నీ మెదడు సంకేతాలపై ఆధారపడి సాగుతాయన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement