ఆర్నెల్ల తర్వాత అంతరిక్షం నుంచి.. | NASA astronaut Jeff Williams, crewmates return to Earth | Sakshi
Sakshi News home page

ఆర్నెల్ల తర్వాత అంతరిక్షం నుంచి..

Sep 7 2016 9:46 AM | Updated on Sep 4 2017 12:33 PM

ఆర్నెల్ల తర్వాత అంతరిక్షం నుంచి..

ఆర్నెల్ల తర్వాత అంతరిక్షం నుంచి..

అంతరిక్ష యాత్రికులతో కూడిన సోయజ్ టిఎంఏ-20ఎం స్పేస్ క్రాఫ్ట్... కజకిస్తాన్ లోని చెజ్ కజగన్ నగరంలో సేఫ్ గా ల్యాండ్ అయ్యింది.

కజకిస్తాన్ః  సుమారు ఆర్నెల్ల కాలం తర్వాత అంతరిక్షం నుంచి ముగ్గురు వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరుకున్నారు. 48 మంది సాహస యాత్రికులకు సారధ్యం వహించిన కమాండర్, నాసా ఆస్ట్రోనాట్ జెఫ్ విలియమ్స్ సహా  ఆయన క్రూమేట్స్ అలెక్సీ ఓఛినిమ్, ఒలేగ్ స్ర్కిపోచ్కాలు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి సురక్షితంగా భూమికి చేరుకుని నాసా వ్యోమగాముల జాబితాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.

మొత్తం 48 మంది సాహస అంతరిక్ష యాత్రికులతో కూడిన సోయజ్ టిఎంఏ-20ఎం స్పేస్ క్రాఫ్ట్... కజకిస్తాన్ లోని చెజ్ కజగన్ నగరంలో 7 సెప్టెంబర్ 2016  బుధవారం ఉదయం  సేఫ్ గా ల్యాండ్ అయ్యింది. ఈ ప్రత్యేక యాత్రలో విలియమ్స్, అలెక్సీ ఓఛినిమ్, ఒలేగ్ స్ర్కిపోచ్కా లు అంతరిక్ష కేంద్రంలో 172 రోజులపాటు  గడిపారు. గతేడాది డిసెంబర్ నెలలో నింగికి ఎగిరిన ఈ వ్యోమగాములు అనేక పరిశోధనలు నిర్వహించి సురక్షితంగా భూమికి చేరుకున్నారు. వీరిలో ముఖ్యంగా విలియమ్స్ అంతరిక్షంలో 534 రోజులు గడిపిన నాసా వ్యోమగాముల జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. స్ర్కిపోచ్కా రెండు విమానాల్లో మొత్తం 331 రోజులు... అలెక్సీ ఓఛినిమ్  172 రోజులు అంతరిక్షంలో గడిపి నాసా వ్యోమగాముల జాబితాలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement