పురుషుడు..ప్రసవించబోతున్నాడు! | Man was having a baby | Sakshi
Sakshi News home page

పురుషుడు..ప్రసవించబోతున్నాడు!

Jan 9 2017 3:10 AM | Updated on Sep 5 2017 12:45 AM

పురుషుడు..ప్రసవించబోతున్నాడు!

పురుషుడు..ప్రసవించబోతున్నాడు!

సృష్టి ధర్మం తిరగబడనుంది! ఒక బ్రిటిష్‌ పురుషుడు కొన్ని నెలల్లో ప్రసవించబోతున్నాడు

లండన్‌: సృష్టి ధర్మం తిరగబడనుంది! ఒక బ్రిటిష్‌ పురుషుడు కొన్ని నెలల్లో ప్రసవించబోతున్నాడు!! లింగమార్పిడితో పురుషుడిగా మారుతున్న 20 ఏళ్ల హేడెన్‌ క్రాస్‌ ప్రస్తుతం 16 వారాల గర్భంతో ఉన్నాడు. ప్రసవంతో బ్రిటన్‌లో బిడ్డకు జన్మనివ్వనున్న తొలి మగాడిగా రికార్డు సృష్టించనున్నాడు. పుట్టుకతో స్త్రీ అయిన హేడెన్‌ మూడేళ్ల కిందటి నుంచి చట్టబద్ధంగా మగాడిలానే జీవిస్తున్నాడు.

పురుషుడిగా మారేందుకు హార్మోన్‌ చికిత్స చేయించుకుంటున్నాడు. భవిష్యత్తులో బిడ్డల్ని కనేందుకు తన అండాలను భద్రపరచాలని కోరగా అందుకు 4 వేల పౌండ్లు ఖర్చవుతుందని, దాన్ని భరించలేమంటూ ప్రభుత్వ ఆరోగ్య సంస్థ తిరస్కరించింది. దీంతో అతడు ఫేస్‌బుక్‌ ద్వారా ఒక వీర్యదాతను కనుగొని గర్భం దాల్చాడు. లింగమార్పిడి పూర్తయ్యాక గర్భం సాధ్యం కాదు కనుక అంతకుముందే బిడ్డను కనాలనుకున్నానని, తాను మంచి నాన్నను అవుతానని హేడెన్‌ చెప్పాడు. 

Advertisement
 
Advertisement
Advertisement