భ్రూణహత్యకు పాల్పడిన మహిళకు 30 ఏళ్ల జైలు శిక్ష | Indian American woman jailed for 30 years for death of child | Sakshi
Sakshi News home page

భ్రూణహత్యకు పాల్పడిన మహిళకు 30 ఏళ్ల జైలు శిక్ష

Mar 31 2015 10:00 PM | Updated on Sep 2 2017 11:38 PM

భ్రూణహత్యకు పాల్పడిన మహిళకు 30 ఏళ్ల జైలు శిక్ష

భ్రూణహత్యకు పాల్పడిన మహిళకు 30 ఏళ్ల జైలు శిక్ష

భ్రూణహత్యకు పాల్పడినందుకు ఓ భారత సంతతి మహిళలకు అమెరికా కోర్టు 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

వాషింగ్టన్: భ్రూణహత్యకు పాల్పడినందుకు ఓ భారత సంతతి మహిళలకు అమెరికా కోర్టు 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పూర్వీ పటేల్(33) అనే మహిళ అమెరికాలోని ఇండియానా రాష్ట్రం గ్రాంగర్ లో నివాసం ఉంటోంది.2013 వ సంవత్సరంలో గర్భవతిగా ఉన్న పూర్వీ  ఆన్ లైన్ ద్వారా విదేశాల నుంచి తెప్పించుకున్న మందులు వాడి గర్భస్రావం చేయించుకుంది.

 

ఈ క్రమంలోనే పిండాన్ని బ్యాగ్ లో చుట్టి చెత్త తీసుకు వెళ్లే వాహనంలో వేసింది.  అనంతరం ఆమెకు రక్తస్రావం అధికం కావడంతో ఆసుపత్రిలో చేరింది. దీనికి సంబంధించి ఆమెను పోలీసులు విచారిస్తే అసలు విషయం బయటపడింది. దీంతో ఆమెపై అప్పట్లో భ్రూణ హత్య కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారించిన కోర్టు పూర్వీకి 30 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు నిచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement