 
													న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా మంగళవారం తెల్లవారుజామున భారత వైమానిక దళం పాకిస్తాన్‌లోని జైషే మహమ్మద్ ఉగ్ర క్యాంపులపై మెరుపు దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఉగ్ర సంస్థలపై చర్యలు తీసుకోవాలని పాక్‌ను ఎన్ని సార్లు కోరిన.. అటు నుంచి సరైన స్పందన రాకపోవడంతో భారత్ మెరుపు దాడుల రూపంలో ఉగ్రవాదులకు గట్టి హెచ్చరికలు పంపింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్‌ను అంతర్జాతీయ సమాజంలో ఒంటరిని చేయాలని భారత్ నిర్ణయించింది. మరోవైపు సరైన సమయంలో భారత్‌ను దెబ్బకొడతామని పాక్ వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇరు దేశాల సైనిక బలాబలాలు చర్చనీయాంశంగా మారాయి. ఇరుదేశాలు కలిగిన సైన్యం, ఆయుధాల వివరాలు..
| భారతదేశం | పాకిస్తాన్ | |
| సైన్యం | 14,00,000 | 6,53,800 | 
| క్షిపణులు | అగ్ని–3 సహా 9 రకాలు | షహీన్–2సహా 2 రకాలు | 
| అణు బాంబులు | 130-140 | 140-150 | 
| యుద్ధ ట్యాంకులు | 3,565 | 2,496 | 
| యుద్ధ విమానాలు | 814 | 425 | 
| విమాన వాహక నౌకలు | 1 | 0 | 
| జలాంతర్గాములు | 16 | 8 | 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
