ఫేస్ బుక్ చరిత్రలో వ్యక్తిగతంగా భారత్ అత్యంత ముఖ్యమైన దేశమని ఫేస్ బుక్ అధినేత మార్క్ జూకర్ బర్గ్ అన్నారు. మోదీ డిజిటల్ ఇండియా కార్యక్రమానికి తాను మద్దతిస్తున్నానని చెప్పారు.
కాలిఫోర్నియా: ఫేస్ బుక్ చరిత్రలో వ్యక్తిగతంగా భారత్ అత్యంత ముఖ్యమైన దేశమని ఫేస్ బుక్ అధినేత మార్క్ జూకర్ బర్గ్ అన్నారు. మోదీ డిజిటల్ ఇండియా కార్యక్రమానికి తాను మద్దతిస్తున్నానని చెప్పారు. ఆదివారం ఫేస్ బుక్ ప్రధాన కార్యాలయాన్ని భారత్ ప్రధాని నరేంద్రమోదీ సందర్శించిన సందర్భంగా ఫేస్ బుక్ ఖాతాదారులతో జరిగిన ప్రశ్నోత్తరాలు వారిరువురు సంయుక్తంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఫేస్ బుక్ కార్యాలయానికి రావడం తనకు చాలా సంతోషంగా ఉందని మోదీ అన్నారు. అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ఒకటి అని చెప్పారు. పరిపాలన రంగంలో సోషల్ మీడియా అతి కీలక పాత్ర పోషించిందని చెప్పారు. జూకర్ బర్గ్తో కలిసిపోవడం తనకు చాలా ఆనందాన్నిచ్చిందని అన్నారు.