
ప్రజలకు ప్రధాని మోదీ సూచన
న్యూఢిల్లీ: పర్వదినాల సందర్భంగా స్వదేశీ వస్తువులను కొనుగోలుచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు సూచించారు. ఈ మేరకు ప్రధాని మోదీ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో ఆదివారం ఒక పోస్ట్ పెట్టారు. ‘‘ 140 కోట్ల మంది భారతీయుల కృషి, సృజనాత్మక వస్తువులైన స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా ఈ పండగ సీజన్‌ను ఆనందాలతో గడపండి. భారతీయ ఉత్పత్తులను కొనండి.
మేం కొన్నది స్వదేశీ ఉత్పత్తి అని గర్వంతో చెప్పండి. పండగ సీజన్‌లో ఏఏ స్వదేశీ ఉత్పత్తులను కొన్నారో వాటి వివరాలను మీమీ సొంత సామాజికమాధ్యమ ఖాతాల్లో పోస్ట్‌చేసి అందరితో షేర్‌చేసుకోండి. స్వదేశీ ఉత్పత్తులను, వాటి కొనుగోళ్లను ప్రోత్సహించండి. కొన్నవి అన్నీ సోషల్ మీడియాలో పెట్టండి. ఇలా మీరు ఇంకొకరిలో స్ఫూర్తిని రగిలించగలరు’’ అని మోదీ హితవు పలికారు.