యూఎస్‌లో దూసుకెళ్తున్న ఢిల్లీ ఐఐటీ స్టూడెంట్‌ | IIT-Delhi engineer developing hybrid regional plane in US | Sakshi
Sakshi News home page

యూఎస్‌లో దూసుకెళ్తున్న ఢిల్లీ ఐఐటీ స్టూడెంట్‌

Apr 6 2017 9:36 AM | Updated on Sep 5 2017 8:07 AM

యూఎస్‌లో దూసుకెళ్తున్న ఢిల్లీ ఐఐటీ స్టూడెంట్‌

యూఎస్‌లో దూసుకెళ్తున్న ఢిల్లీ ఐఐటీ స్టూడెంట్‌

ఢిల్లీ ఐఐటీకి చెందిన మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్వ విద్యార్థి ఆశిష్‌ కుమార్‌ అమెరికాలో దూసుకెళుతున్నాడు.

న్యూఢిల్లీ: ఢిల్లీ ఐఐటీకి చెందిన మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్వ విద్యార్థి ఆశిష్‌ కుమార్‌ అమెరికాలో దూసుకెళుతున్నాడు. ప్రస్తుతం అమెరికాలోని కిర్క్‌లాండ్‌ అనే సంస్థను స్థాపించడమే కాకుండా దానికి సీఈవోగా పనిచేస్తున్న అతడు అమెరికాలో హైబ్రిడ్‌ విమానాలను తయారుచేయబోతున్నాడు. ఈ విమానాలు కూడా తిరిగి భారతదేశానికి విక్రయించాలని అనుకుంటున్నాడు. జునుమ్‌ ఎయిరో అనే సంస్థ ఆధారంగా ప్రాంతీయ హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ విమానాలు రూపొందిస్తున్నాడు.

దాదాపు 1,100 కిలోమీటర్ల వరకు హైబ్రిడ్‌ విమానాలను 2020లోగా, 1,600 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలవాటిని 2030లోగా తయారు చేయనున్నారు. ‘బోయింగ్‌ అండ్‌ జెల్‌బ్లూ సంస్థలు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నాయి. మేం తొలుత 20 సీట్లు ఉండే హైబ్రిడ్‌ విమానాలతో వస్తాం. ప్రొటోటైప్‌ విమానాలను మరో రెండేళ్లలో తీసుకొస్తామని నమ్ముతున్నాము. వాణిజ్య విమానాలను 2020నాటిలోగా తీసుకొస్తాము’  అని ఆశిష్‌ కుమార్‌ తెలిపాడు. ప్రస్తుతం అతడు మెకానికల్‌ అండ్‌ ఎయిరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో కార్నెల్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement