హానర్‌ ఫోన్‌ పోయింది..ఇస్తే రూ.4 లక్షలు

Honor Loses Smartphone Prototype, Offers Rs. 4 Lakh Reward - Sakshi

సామాన్య మానవుడు విలువైన స్మార్ట్‌ఫోన్‌ను పోగొట్టుకోవడం అంటే చెప్పలేని బాధ. మరి అలాంటిది టెక్‌ జెయింట్‌ పొరపాటున స్మార్ట్‌ఫోన్‌ను కోల్పోతే.. ధర పరంగా పెద్దగా బాధపడకపోయినా.. ఇంకా లాంచ్‌ కావాల్సిన స్మార్ట్‌ఫోన్‌  మిస్‌ అయితే మాత్రం కష్టమే. జర్మనీకి చెందిన మొబైల్‌ మేకర్‌ హువావే సబ్‌బ్రాంబ్‌ హానర్‌కు చెందిన ఉద్యోగి ఇలాంటి ఇబ్బందుల్లోనే చిక్కుకున్నాడు. దీంతో ఆ ఫోన్‌ను తెచ్చి ఇచ్చిన వారికి భారీ ఆఫర్ ప్రకటించింది కంపెనీ. సురక్షితంగా హానర్‌ మొబైల్‌ తెచ్చి ఇస్తే.. సుమారు రూ. 4 లక్షల బహుమానం ఇస్తానని ట్విటర్‌ ద్వారా  వెల్లడించింది.

హానర్‌ ఉద్యోగి ఏప్రిల్‌ 22న  జర్మనీలోని మ్యూనిచ్‌కి  రైల్లో వెళుతుండగా హానర్‌ మొబైల్‌ను  పోగొట్టుకున్నాడు.  దీంతో అప్‌కమింగ్‌  ప్రోటో టైప్‌  ఈ స్మార్ట్‌ఫోన్‌ను తిరిగి ఇవ్వాలని  హువావే విజ్ఞప్తి చేసింది.గ్రే ప్రొటక్టివ్‌ కవర్‌తో ఉన్న హానర్‌ మొబైల్‌ను సురక్షితంగా రిటన్‌ చేసిన వారికి  5 వేల యూరోలు (రూ. 4లక్షలు) నజరానా ఇస్తానని  హానర్‌ ట్వీట్‌చేసింది. 

కాగా మే 21 లండన్‌లో నిర్వహించనున్న ఒక ఈవెంట్‌లో హానర్‌ 20సిరీస్‌లో భాగంగా హానర్‌ 20 ప్రొ, హానర్‌ 20ఏ, హానర్‌ 20సీ, హానర్‌ 20 ఎక్స్‌ తదితర స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేయనుంది.   పోయిన  స్మార్ట్‌ఫోన్‌ వీటిల్లో ఒకటి కావచ్చని పలు అంచనాలు నెలకొన్నాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top