కరెంటునిచ్చే హైటెక్ వస్త్రం! | High-tech cloth | Sakshi
Sakshi News home page

కరెంటునిచ్చే హైటెక్ వస్త్రం!

Sep 15 2016 12:16 AM | Updated on Sep 4 2017 1:29 PM

కరెంటునిచ్చే హైటెక్ వస్త్రం!

కరెంటునిచ్చే హైటెక్ వస్త్రం!

చేతికున్న వస్త్రాలను చూస్తే ఏమనిపిస్తోంది.. కొత్త స్టైల్ కోసం అలా కట్టుకున్నాడనుకుంటున్నారా..? అదేం కాదు..

అమెరికా : చేతికున్న వస్త్రాలను చూస్తే ఏమనిపిస్తోంది.. కొత్త స్టైల్ కోసం అలా కట్టుకున్నాడనుకుంటున్నారా..? అదేం కాదు.. ఇవి హైటెక్ వస్త్రాలు... ఎందుకంటే వీటితో తయారైన దుస్తులను ధరిస్తే విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. నూలు పోగులతో పాటు అక్కడక్కడా ఉండే ప్లాస్టిక్ సోలార్ సెల్స్ సూర్యుడి వేడిని విద్యుత్‌గా మారుస్తాయి. అంతేకాదు వీచే గాలితో కూడా అందులో టైబ్రో ఎలక్ట్రిక్ నానో జనరేటర్లు కరెంటును ఉత్పత్తి చేస్తాయి. గుండీల స్థానంలో బ్యాటరీలను వాడితే ఈ విద్యుత్తునే స్మార్ట్‌ఫోన్లు, జీపీఎస్ పరికరాలకు చార్జింగ్ పెట్టుకోవచ్చు.

అమెరికాలోని జార్జియా టెక్ యూనివర్సిటీ పరిశోధకుడు ఝాంగ్ లింగ్ వాంగ్ ఈ ఐడియాను వాస్తవరూపంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ట్రిబో ఎలక్ట్రిక్ నానో జనరేటర్లు.. ట్రిబో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, ఎలక్ట్రోస్టాటిక్ ఇండక్షన్ అనే రెండు భౌతిక ధర్మాల ఆధారంగా కదలికలు, ప్రకంపనల నుంచి చిన్నమొత్తంలో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. 320 మైక్రోమీటర్ల మందం మాత్రమే ఉండే ఈ హైటెక్ వస్త్రాన్ని జోడించడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఝాంగ్ చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement