డల్లాస్‌లో ప్రపంచ తెలంగాణ సమావేశాలు | Global Telangana convention started in dallas | Sakshi
Sakshi News home page

డల్లాస్‌లో ప్రపంచ తెలంగాణ సమావేశాలు

Jun 4 2016 9:20 AM | Updated on Sep 4 2017 1:40 AM

డల్లాస్‌లో ప్రపంచ తెలంగాణ సమావేశాలు

డల్లాస్‌లో ప్రపంచ తెలంగాణ సమావేశాలు

అగ్రరాజ్యంలో తొలిసారిగా ప్రపంచ తెలంగాణ సమావేశాలు డల్లాస్‌లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.

అగ్రరాజ్యంలో తొలిసారిగా ప్రపంచ తెలంగాణ సమావేశాలు డల్లాస్‌లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరుగుతున్న ఈ సమావేశంలో 30 దేశాల నుంచి మూడువేల మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. అమెరికాలోని అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు దీనికి హాజరయ్యారు. బాంకెట్‌కు దాదాపు వెయ్యిమంది హాజరయ్యారు. తెలంగాణ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే సంపత్ కుమార్, ఐజీ శివధర్ రెడ్డి, ఇంకా రఘుమా రెడ్డి, డీకే అరుణ, మధుయాష్కీ గౌడ్, మాజీ ఎంపీ ఆత్మచరణ్ రెడ్డి తదితరులు వెళ్లారు.

వీరితో పాటు తెలంగాణ నుంచి రాజకీయ, సినీ ప్రముఖులు, కళాకారులు, రచయితలు, వ్యాపారవేత్తలు కూడాపాల్గొంటున్నారు. తొలిరోజు బాంకెట్ డిన్నర్‌తో ప్రారంభమై రెండోరోజు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు, మూడో రోజు విద్య, వ్యవసాయం, వైద్యం, ఉపాధి, పెట్టుబడుల అంశాలపై సెమినార్లు నిర్వహిస్తారు.






Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement