బార్‌లో గాంధీ.. మం‍డిపడుతున్న భారతీయులు

Gandhi Painting In Dubai Bar Upset Indins - Sakshi

దుబాయ్ బార్‌లో గాంధీ పెయింటింగ్‌

దుబాయ్‌ : భారత జాతిపిత మహాత్మా గాంధీకి దుబాయ్‌లో తీవ్ర అవమానం జరిగింది. గాంధీ ఫోటోను పోలివుండే పెయింటింగ్‌ను బార్‌ యాజమాన్యం మద్యంసేవించే ప్రాంతంలో వేసింది. దీనిపై భారతీయులు తీవ్రంగా మండిపడుతున్నారు. గాంధీ పెయింటింగ్‌ కలిగి ఉన్న ఫోటోను యాజమాన్యం ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌ చేయడంతో ఈ విషయం భారతీయుల దృష్టికి వచ్చింది.  ఆ ఫోటోలో మహిళలు, పురుషులు మద్యం సేవిస్తూ వెనుక గాంధీ పెయింటింగ్‌ కనిపిస్తూ ఉంటుంది. దీనిని దుబాయ్‌లోని భారత ప్రతినిధి దృష్టికి తీసుకెళ్లగా బార్‌ యాజమాన్యంపై న్యాయ బద్దంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సెప్టెంబర్‌ 28న దుబాయ్‌లోని అల్ మన్ఖుల్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఘటనపై దుబాయ్‌లోని భారత న్యాయవాది అంజనా భాటియా మాట్లాడుతూ..  భారతీయూల మనోభావాలు దెబ్బతినేలా జాతిపిత గాంధీ పెయింటింగ్‌ను బార్‌లో వేశారని, పెయింటింగ్‌ ముందు మహిళలు అసభ్యకరంగా మద్యం తాగుతూ డ్యాన్స్‌ చేస్తున్నారని విమర్శించారు. భారత్‌లో ఇలాంటి చర్యలు శిక్షించ తగ్గ నేరంగా భావిస్తారని.. యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకునేలా పోరాడతామన్నారు. భారతీయుల ఎక్కువగా ఉపాధి పొందే దుబాయ్‌లో గాంధీని ఇలా అవమానించడం తమకు ఎంతో నిరశ కలిగిందని న్యాయవాది అన్నారు. 

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top