ఐదు దేశాలకు వీసాలివ్వం: కువైట్‌ | dont Give Visa that five countries | Sakshi
Sakshi News home page

ఐదు దేశాలకు వీసాలివ్వం: కువైట్‌

Feb 3 2017 1:28 AM | Updated on Aug 25 2018 7:50 PM

ఉగ్రవాదులు తమ దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందన్న కారణంతో పాకిస్తాన్ తో సహా ఐదు దేశాల పౌరులకు వీసాలు జారీ చేయడంపై కువైట్‌ ప్రభుత్వం నిషేధం విధించింది.

కువైట్‌: ఉగ్రవాదులు తమ దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందన్న కారణంతో పాకిస్తాన్ తో సహా ఐదు దేశాల పౌరులకు వీసాలు జారీ చేయడంపై కువైట్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. సిరియా, ఇరాక్, అఫ్గానిస్తాన్ , ఇరాన్ తో పాటు పాకిస్తాన్ లకు చెందిన పౌరులెవరికీ వీసాలు మంజూరు చేయకూడదని ఈమేరకు కువైట్‌ ప్రభుత్వం నిర్ణయించింది.

వలసలకు వ్యతిరేకంగా ఏడు ముస్లిం దేశాలపై నిషేధం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల తీసుకున్న నిర్ణయం తాజాగా కువైట్‌ దేశంపైనా ప్రభావం చూపింది. శరణార్థుల పేరుతో ఉగ్రవాదులు తమ దేశంలో ప్రవేశించే అవకాశాలున్నందున కువైట్‌ కూడా ప్రధానంగా 5 ముస్లిం దేశాలకు వీసాలపై నిషేధం విధించినట్లు కువైట్‌ లోని స్పుత్నిక్‌ ఇంటర్నేషనల్‌ పత్రిక తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement