
వాషింగ్టన్ : ఉగ్రవాదం నిరోధించే విషయంలో పాకిస్థాన్ అనుసరిస్తున్న తీరుపట్ల తమ అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ అస్సలు సంతృప్తిగా లేరని అమెరికా శ్వేత సౌదం ప్రకటించింది. అలాగే, తొలిసారి పాక్ చర్యలను తమ అధ్యక్షుడు ట్రంప్ సీరియస్‌గా తీసుకుంటున్నారని, వారిపై తగిన చర్యలు తీసుకునే యోచన చేస్తున్నారని పేర్కొంది. 'పాకిస్థాన్‌తో సంబంధాల విషయంలో కొంత స్పష్టతను తెచ్చుకున్నాం. తొలిసారి పాక్ చర్యలకు తగిన నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటున్నాం' అని వైట్ హౌజ్ డిప్యూటీ ప్రెస్ సెక్రటెరీ రాజ్ షా మీడియా సమావేశంలో చెప్పారు.
తాము అఫ్ఘనిస్థాన్‌లోని తమ భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నామని, ఐసిస్‌కు పైచేయిని ఊహించని విధంగా సాధిస్తున్నామని, అందులో భాగంగానే అక్కడ ఉన్న తమ సైన్యాన్ని తగ్గిస్తున్నామని చెప్పారు. వాస్తవానికి పాక్ తాము చెప్పిన ప్రకారం నడుచుకోవడానికి ఇదే మంచి అవకాశం అని, ప్రాంతీయ భద్రతను మెరుగు పరుచుకునేందుకు పాక్ ఇదో గొప్ప ఛాన్స్ అని పేర్కొన్నారు.