సయోధ్య ప్రయాణం సాగిందిలా..

Donald Trump, Kim Jong-un meet face-to-face - Sakshi

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ఉ.కొరియా అధినేత కిమ్‌జోంగ్‌ ఉన్‌ల మధ్య జరిగిన చారిత్రక శిఖరాగ్ర సమావేశానికి ముందు చోటుచేసుకున్న కొన్ని కీలక పరిణామాలు వరుసగా..

2017, మార్చి 7: ఉ.కొరియా అణ్వాయుధ ముప్పు తీవ్రమైందన్న ట్రంప్‌. అంతకుముందు రోజు జపాన్‌ వైపు నాలుగు బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించిన ఉ.కొరియా
ఏప్రిల్‌ 26: ఉ.కొరియాపై తమ విధానాన్ని కాంగ్రెస్‌కు వివరించిన ట్రంప్‌ ప్రభుత్వం. ఆ దేశంపై ఆంక్షలు విధించాలని పిలుపునిస్తూ ప్రకటన జారీ
ఏప్రిల్‌ 27: ఉ.కొరియాతో తీవ్ర ఘర్షణ తప్పదేమోనన్న ట్రంప్‌. దౌత్య మార్గంలో సమస్య పరిష్కారానికి మొగ్గు
మే 24: కిమ్‌ అణ్వాయుధాలు కలిగిన పిచ్చోడని, ఆయన్ని స్వేచ్ఛగా వదిలేయొద్దన్న ట్రంప్‌
జూన్‌ 1: ఉ.కొరియా అణు కార్యక్రమాలతో సంబంధమున్న వ్యక్తులు, సంస్థపై అమెరికా ఆంక్షలు
జూలై 4: అమెరికాలోని అలస్కాని లక్ష్యంగా చేసుకోగల దీర్ఘశ్రేణి క్షిపణిని జపాన్‌ సముద్రంలోకి ప్రయోగించిన ఉ.కొరియా
సెప్టెంబర్‌ 19: యూఎన్‌ సాధారణ అసెంబ్లీలో చేసిన తన తొలి ప్రసంగంలో ఉ.కొరియాను సర్వనాశనం చేస్తానని హెచ్చరించిన ట్రంప్‌
సెప్టెంబర్‌ 21: ట్రంప్‌ మతిస్థిమితం కోల్పోయారని, ‘భయపడిన కుక్క గట్టిగా అరుస్తోంద’ని వ్యాఖ్యానించిన కిమ్‌
నవంబర్‌ 20: ఉ.కొరియాను ఉగ్రవాదానికి మద్దతిస్తోన్న దేశంగా అధికారికంగా ప్రకటించిన ట్రంప్‌
డిసెంబర్‌ 22: శుద్ధిచేసిన ఇంధన ఉత్పత్తుల ఎగుమతుల్లో 90 శాతం కోత విధించడంతో పాటు ఉ.కొరియాపై అదనపు ఆంక్షలు విధించిన యూఎన్‌ భద్రతా మండలి
2018, జనవరి 1: అమెరికా నుంచి ఎదురయ్యే ఎలాంటి అణు ముప్పునైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రకటించిన కిమ్‌
ఫిబ్రవరి 23: ఉ.కొరియా రవాణా, వాణిజ్య కంపెనీలు, నౌకలు లక్ష్యంగా కొత్త ఆంక్షలు ప్రకటించిన ట్రంప్‌
మార్చి 8: కొరియా ద్వీపకల్ప నిరాయుధీకరణపై చర్చించడానికి తమ నాయకులు జూన్‌ లోపు సమావేశంకాబోతున్నారని తొలిసారి ప్రకటించిన అమెరికా, ఉ.కొరియా
మే 8: యూఎస్‌–ఉ.కొరియాల సదస్సు సన్నద్ధతలో భాగంగా ఉ.కొరియాలో పర్యటించిన అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో
మే 9: ముగ్గురు అమెరికా పౌరులను నిర్బంధం నుంచి విడుదల చేసిన ఉ.కొరియా
మే 10: జూన్‌ 12న సింగపూర్‌లో కిమ్‌తో భేటీ కానున్నట్లు ప్రకటించిన ట్రంప్‌
మే 24: ప్యుంగేరీలోని అణు పరీక్షల కేంద్రాన్ని ధ్వంసం చేసినట్లు ప్రకటించిన ఉ.కొరియా
మే 24: ప్రతిపాదిత సమావేశాన్ని రద్దుచేసుకుంటున్నట్లు కిమ్‌కు లేఖ రాసిన ట్రంప్‌
మే 25: అమెరికాతో చర్చలకు ఎల్లప్పుడూ సిద్ధమేనని ప్రకటించిన ఉ.కొరియా
జూన్‌ 1: మాటమార్చిన ట్రంప్‌. కిమ్‌తో జూన్‌ 12న సమావేశమవుతానని పునరుద్ఘాటన
జూన్‌ 10: చారిత్రక సమావేశానికి సింగపూర్‌ చేరుకున్న ట్రంప్, కిమ్‌
జూన్‌ 11: ఉ.కొరియా సంపూర్ణ అణు నిరాయుధీకరణకు అంగీకరిస్తే, బదులుగా ఆ దేశ భద్రతకు హామీ ఇస్తామని అమెరికా ప్రకటన
జూన్‌ 12: సమావేశమైన ట్రంప్, కిమ్‌. అనుకున్నట్లుగానే, అమెరికా భద్రతా హామీలకు బదులుగా కొరియా ద్వీపకల్పంలో సంపూర్ణ నిరాయుధీకరణకు కలసి పనిచేయాలని ఇరు దేశాలు అంగీకారం.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top