నేపాల్లో సంభవించిన భూకంపంలో మృతి చెందిన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.
హైదరాబాద్: నేపాల్లో సంభవించిన భూకంపంలో మృతి చెందిన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజా నివేదికల ప్రకారం రెండు వేలకు పైగా మృతదేహాలు లభ్యమైనట్టు సమాచారం. ఒక్క ఖాట్మండులోనే వెయ్యి మందికి పైగా మృతి చెందినట్టు సమాచారం. వేలమంది ప్రజలు గడ్డకట్టిన చలిలోనే వణికిపోతూ.. రోడ్లపైనే జాగారం చేశారు. భూకంపం ధాటికి ఎవరెస్టు శిఖరంపై దాదాపు 18 మంది మరణించారు. ఈ తీవ్ర ధాటికి భారత్లోనే 53 మంది మృతి చెందగా.. 240 మంది గాయపడ్డారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున ఆర్థిక సహాయాన్ని కేంద్రప్రభుత్వం ప్రకటించింది.