
కాలిఫోర్నియా : అమెరికాలోని కాలిఫోర్నియాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా వచ్చిన కారు డివైడర్‌ను ఢీ కొట్టడంతో గాలిలోకి ఎగిరి ఎదురుగా ఉన్న బిల్డింగ్‌లోని రెండో ఫ్లోర్‌లోకి దూసుకెళ్లింది.
ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు గాయాలైనట్లు కాలిఫోర్నియా ఫైర్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. కారును నడుపుతున్న డ్రైవర్ డ్రగ్స్ తీసుకోవడం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపింది. కారు రెండో అంతస్తులోకి దూసుకెళ్లడంతో అక్కడ ఉన్న డెంటిస్టు కార్యాలయం ధ్వంసమైనట్లు వివరించింది.
భారీ క్రేన్‌తో కారును బిల్డింగ్‌లో నుంచి బయటకు తీసినట్లు వెల్లడించింది. కారు ప్రమాదంలో రేగిన మంటలకు డెంటిస్టు కార్యాలయంలోని కొన్ని ఫైళ్లు కాలిపోయినట్లు తెలిపింది.