బబుల్‌ గమ్‌తో బూట్లు..!!

Can You Imagine Boots With Bubble Gum - Sakshi

లండన్‌ : మీ చెప్పులకు ఎప్పుడైనా బబుల్‌ గమ్‌ అంటుకుందా?. చాలా మందికి ఈ అనుభవం ఉండి ఉంటుంది. అలా జరిగినప్పుడు చాలా చిరాకు పడి కూడా ఉంటారు. మరి అదే బబుల్‌ గమ్‌ను మీ కాళ్లకు తొడుక్కోవాల్సి వస్తే?. అవును. బబుల్‌ గమ్‌తో బూట్లను తయారు చేశారు యూకేకు చెందిన ఓ వ్యాపారవేత్త. బబుల్‌ గమ్‌ను రబ్బర్‌గా మలచిన అన్నా బుల్లస్‌ అనంతరం దానితో బూట్లను తయారు చేశారు.

బుల్లస్‌కు యూకేలో గమ్‌డ్రాప్‌ లిమిటెడ్‌ అనే కంపెనీని స్థాపించారు. వినియోగించిన బబుల్‌ గమ్‌తో రోజూవారి అవసరాలకు ఉపయోగించే వస్తువులను ఈ కంపెనీ తయారు చేస్తుంది. పెన్సిల్స్‌, రబర్లు, కంటైనర్లు, దువ్వెనలు, రెయిన్‌ బూట్లు, డిజైనర్ బూట్లు తదితరాలను ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న వాటిలో ఉన్నాయి. వినియోగించిన బబుల్‌ గమ్‌ సమస్యే తనను ఈ కంపెనీ ప్రారంభించేలా చేసిందని అన్నా బుల్లస్‌ పేర్కొన్నారు.

బబుల్‌ గమ్‌ ఎలా తయారవుతుంది..
బబుల్‌ గమ్‌ కూడా ఓ సింథటిక్‌ రబ్బరే. బ్యుటైల్‌ రబ్బర్‌ నుంచి దీన్ని తయారు చేస్తారు. బ్యుటైల్‌ రబ్బర్‌ కారణంగానే బబుల్‌ను ఊదినపుడు సాగుతూ గాలి బుడగ నోటి నుంచి బయటకు వస్తుంది. నమిలిన అనంతరం ఊసేసిన బబుల్‌ గమ్‌ భూమిలో కలసిపోదు. ఎంతకాలమైనా అది అలానే ఉంటుంది. ప్రత్యేకమైన పరికరాలతో దాన్ని రీ-సైకిల్‌ చేయొచ్చు.

ఇలా వేస్ట్‌గా పడివుంటున్న బబుల్‌ గమ్‌ను వినియోగించడానికి అనువుగా మార్చేందుకు అన్నా బుల్లస్‌ దాదాపు 8 నెలల పాటు పరిశోధనా శాలలో గడిపారు. ఓ రోజు అందులో విజయం సాధించారు. అనంతరం దానికి బుల్లస్‌ రీ-సైకిల్డ్‌ గమ్‌ పాలీమర్‌(బీఆర్జీపీ) అని నామకరణం చేశారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top