వామ్మో.. అనకొండతో గేమ్స్‌.. | boy played on python : video goes viral | Sakshi
Sakshi News home page

వామ్మో.. అనకొండతో గేమ్స్‌.. చిచ్చరపిడుగురా!

Published Sun, Oct 15 2017 2:28 PM | Last Updated on Mon, Oct 16 2017 11:50 AM

boy played on python : video goes viral

సాక్షి వెబ్‌ : రెండు మూరల ఎత్తు, మూడేళ్ల వయసు. ఆ పాటికే వాడు వీరుడైపోయాడు! శక్తిమంతమైన అనకొండను ఆటాడించాడు... దానిపైన కూర్చొని జాలీరైడ్‌ చేశాడు! కనీసం కొండచిలువ భోజనంలో పావువంతు కూడా ఉండని బుడతడికి ఇంత ధైర్యం ఎలా వచ్చింది...? మనిషి కనబడటమే కరకరా నలిపేసే జీవి.. వీడితో మాత్రం ఎందుకు ఆటలాడింది...? ఇప్పటికే వైరల్‌ అయిన ఈ వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ఈ బాలుడి పేరు తుయోంగ్‌(3). ఉండేది వియత్నాంలోని హత్రుంగ్‌ జిల్లా హలాంగ్‌ ప్రాంతం. ఇటీవల కురిసిన భారీ వర్షం కారణంగా తుయోంగ్‌ వాళ్ల ఊళ్లోని ఇళ్లులోకి వరద వచ్చిచేరింది. అప్పుడు తుయోంగ్‌ అమ్మానాన్నలు.. కొండచిలువను ఆ నీటిలోకి వదిలారు. అది.. వాళ్ల పెంపుడు కొండచిలువ అన్నమాట!!

కొండచిలువతో తుయోంగ్‌ ఆటాడుకుంటున్న దృశ్యాలను వాళ్ల బంధువొకరు వీడియోతీసి, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. అంత పెద్ద పాముపై బుడ్డోడ్డు కూర్చోవడాన్ని నమ్మని కొందరు.. దీన్నొక గ్రాఫిక్‌గా భావించారట! వీడియో వైరల్‌ కావడంతో పలు మీడియా సంస్థలు తుయోంగ్‌ ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పలకరిస్తున్నారు. వీడియోని దృశ్యాలన్నీ వాస్తవాలేనని, తుయోంగ్‌కు ఆ కొండచిలువంటే చాలా ఇష్టమని వాళ్ల పెద్దలు చెప్పుకొచ్చారు..

అనకొండపై బుడ్డోడి జాలీరైడ్‌ వీడీయో

1
1/4

2
2/4

3
3/4

4
4/4

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement