రెగ్యులర్‌గా ట్వీట్స్ పోస్టు చేసే అలవాటు మీకుందా? ట్విట్టర్‌లో మిమ్మల్ని తగినంత మంది ఫాలో అవుతున్నారా? అయితే, మీ ప్రమేయం లేకుండానే.. ట్విట్టర్ మీ జీవిత చరిత్రను ఇట్టే చెప్పేయగలదు.
ట్విట్టర్ మీ జీవిత చరిత్రను చెప్పేయ గలదు
వాషింగ్టన్: రెగ్యులర్‌గా ట్వీట్స్ పోస్టు చేసే అలవాటు మీకుందా? ట్విట్టర్‌లో మిమ్మల్ని తగినంత మంది ఫాలో అవుతున్నారా? అయితే, మీ ప్రమేయం లేకుండానే.. ట్విట్టర్ మీ జీవిత చరిత్రను ఇట్టే చెప్పేయగలదు.. జాగ్రత్త! మీరు పోస్ట్ చేసే ట్వీట్లలో పేర్కొన్న ముఖ్యమైన సంఘటనల ఆధారంగా మీ జీవిత చరిత్రను పూసగుచ్చే కొత్త టెక్నిక్ అందుబాటులోకి వచ్చింది. కార్నెగీ మెల్లన్ వర్సిటీ, ఇథకలోని కార్నెల్ వర్సిటీలకు చెందిన పరిశోధకులు జివీ లీ, క్లైరె కార్డీలు రూపొందించిన అల్గోరిథమ్ టెక్నిక్ బాగా పనిచేస్తోందని ఎంఐటీ టెక్నాలజీ రివ్యూ పేర్కొంది. వ్యక్తులు పోస్ట్ చేసిన ట్వీట్లను జల్లెడపట్టి.. వారి జీవిత చరిత్రను రూపొందించవచ్చని అధ్యయనంలో లీ, కార్డీ స్పష్టం చేశారు. 2011-13లో 21 నెలల కాలంలో 20 మంది ట్వీట్ల ఆధారంగా ముఖ్య సంఘటనలను రాసుకోమని లీ, కార్డీ వారికే పురమాయించారు.
వికీపీడియా, ఇతరత్రా సేకరించిన సమాచారంతో 20 మంది ప్రముఖుల జీవిత చరిత్రలను రూపొందించారు. అదేమాదిరిగా, తమ అల్గోరిథమ్ టెక్నిక్ ద్వారా ఈ 40 మంది జీవిత చరిత్రలను లీ, కార్డీ తయారు చేశారు. వీటిని పోల్చి చూడగా, వారి జీవితంలో అన్ని ముఖ్యఘటనలతో కూడిన జీవిత చరిత్రలను అల్గోరిథమ్ సమగ్రంగా రూపొందించినట్లు తేలింది