పురాతన ‘స్నేక్‌ షార్క్‌’ కనిపించింది..! 

Ancient Shark With A Snake Head And 300 Teeth Is Why We Should Just Say Nope To The Ocean - Sakshi

వాషింగ్టన్‌ : ఆది మానవుడి జీవన శైలిని గుర్తు చేసే సంఘటన అట్లాంటిక్‌ మహా సముద్రంలో వెలుగు చూసింది. డైనోసార్ల కాలానికి చెందిన ఆరు అడుగుల స్నేక్‌ షార్క్‌(పాము తల ఆకారం) 80 మిలియన్ల సంవత్సరాల తర్వాత పోర్చుగల్‌ తీరంలో మనిషి కంటికి కనిపించింది. ఆది మానవులు మహాసముద్రాల్లో వేటకు వెళ్లి స్నేక్‌ షార్క్‌కు బలైన సంఘటనలు చాలానే ఉన్నాయి. అయితే, కాలక్రమంలో డైనోసార్లు, ట్రైనోసార్లతో పాటు స్నేక్‌షార్క్‌లు అంతరించిపోయాయని అందరూ భావించారు. 

కానీ, అంటార్కింటిక్‌ మహాసముద్రంలోని సుదూర లోతుల్లో స్నేక్‌ షార్క్‌ను చూసిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆరు అడుగుల పొడవు పెరిగే స్నేక్‌ షార్క్‌లు 25 వరుసల్లో 300 పదునైన పళ్లను కలిగివుంటాయని చెప్పారు. ఇతర షార్క్‌లు, చేపలు, ఆక్టోపస్‌ల శరీరాలను తన పళ్లతో స్నేక్‌ షార్క్‌ చీర్చి ఆహారంగా తీసుకుంటుందని తెలిపారు. జపాన్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాల్లోని సముద్ర తీరాల్లో స్నేక్‌ షార్క్‌ నివాసం ఉంటున్నట్లు వెల్లడించారు.

భూమిపై ఉన్న ప్రపంచంలో ఇప్పటివరకూ మనిషి అన్వేషించింది కేవలం 5 శాతం మాత్రమేనని చెప్పారు. మిగిలిన 95 శాతం ప్రపంచంలో నివసిస్తున్న జీవరాశి గురించి మనకు తెలియాల్సింది చాలానే ఉందని తెలిపారు.

Back to Top