అమెరికా దాడుల్లో 7,631 మంది హతం | america and co attacks kills 7631 people | Sakshi
Sakshi News home page

అమెరికా దాడుల్లో 7,631 మంది హతం

Apr 25 2017 6:15 AM | Updated on Apr 4 2019 3:25 PM

అమెరికా దాడుల్లో 7,631 మంది హతం - Sakshi

అమెరికా దాడుల్లో 7,631 మంది హతం

అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు మూడేళ్ల క్రితం ఐసిస్‌పై యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు సిరియాలో 7,631 మంది ప్రాణాలు కోల్పోయారని బ్రిటన్‌కు చెందిన ఒక సంస్థ తెలిపింది.

కైరో: అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు మూడేళ్ల క్రితం ఐసిస్‌పై యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు సిరియాలో 7,631 మంది ప్రాణాలు కోల్పోయారని బ్రిటన్‌కు చెందిన ఒక సంస్థ తెలిపింది. లండన్‌ కేంద్రంగా పనిచేసే సిరియా మానవ హక్కుల పరిశీలన సంస్థ (ఎస్‌ఓహెచ్‌ఆర్‌) ఆదివారం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. మృతుల్లో 1,256 మంది పౌరులు కాగా, వీరిలో 275 మంది మైనర్లు, 184 మంది మహిళలు ఉన్నారు.

అమెరికా సంకీర్ణ దళాలు 2014 సెప్టెంబరులో దాడులు మొదటినప్పటి నుంచి 5,961 మంది ఐసిస్‌ సభ్యులు హతమయ్యారు. వీరిలో ఎక్కువ మంది విదేశీయులే! అల్‌ కాయిదాకు గతంలో అనుబంధంగా పనిచేసిన సభాత్‌ ఫతే అల్‌–షమ్‌ను కూడా సంకీర్ణ దళాలు వదిలిపెట్టడం లేదు. ఈ సంస్థకు చెందిన 141 మందిని అమెరికా దళాలలు చంపేశాయి. జైష్‌ అల్‌–సున్నా వంటి ఇతర చిన్నాచితక ఉగ్రవాద సంస్థల సభ్యులు కూడా పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement