సోమాలియాలో ఉగ్రదాడి, ఏడుగురి మృతి | 7 killed in Somalia beach restaurant attack | Sakshi
Sakshi News home page

సోమాలియాలో ఉగ్రదాడి, ఏడుగురి మృతి

Aug 26 2016 10:37 AM | Updated on Sep 4 2017 11:01 AM

సోమాలియా రాజధానిలో బాంబులు, కాల్పులతో జరిగిన దాడుల్లో ఏడుగురు మృతి చెందారు

మోగాదిషుః సోమాలియా రాజధాని మోగాదిషులో ఉగ్రమూకలు మళ్ళీ దాడులకు తెగబడ్డాయి. బీచ్ రెస్టారెంట్ పై బాంబులు, కాల్పులతో జరిగిన దాడుల్లో ఏడుగురు మృతి చెందినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. లిడో ప్రాంతంలోని బనాదిర్ బీచ్ క్లబ్ బయట తొలుత కారు బాంబును పేల్చిన ఉగ్రవాదులు, అనంతరం భవనంలోకి చొరబడి కాల్పులు జరిపినట్లు పోలీసులకు అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

గురువారం రాత్రి జరిగిన దాడి అనంతరం బీచ్ క్లబ్ ను చుట్టు ముట్టిన భద్రతా బలగాలు రాత్రంతా ఆరుగంటలపాటు నిర్వహించిన ఆపరేషన్ లో.. దాడులకు పాల్పడ్డ ఇద్దరు దుండగులను హతమార్చి, ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించాయి. అయితే ఈ దాడులకు ఎవరు బాధ్యులన్న విషయం మాత్రం ఇప్పటివరకూ ఏ సంస్థలూ  వెల్లడించలేదు

Advertisement

పోల్

Advertisement