ఇండోనేషియాలో భూకంపం | 6.2 magnitude quake strikes central Indonesia: USGS | Sakshi
Sakshi News home page

ఇండోనేషియాలో భూకంపం

Sep 10 2014 11:10 AM | Updated on Sep 2 2017 1:10 PM

ఇండోనేషియాలో బుధవారం మళ్లీ భూమి కంపించింది. భూ ప్రకంపనలు రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదు అయినట్లు అమెరికా జియోలాజకిల్ సర్వే వెల్లడించింది.

జకర్తా : ఇండోనేషియాలో బుధవారం మళ్లీ భూమి కంపించింది. భూ ప్రకంపనలు రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదు అయినట్లు అమెరికా జియోలాజకిల్ సర్వే వెల్లడించింది. భూమి ఒక్కసారిగా కంపించటంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ముందుగా భూ ప్రకంపనలను 6.5 అనుకున్నా... తర్వాత 6.2గా సవరించారు. మలుకా సముద్రంతో పాటు సులవేసీ ద్వీపాల మధ్య ఈ భూకంపం సంభవించంది. అయితే ఇండోనేషియన్ అధికారులు మాత్రం ఎలాంటి సునామీ ముప్పు లేదని తెలిపారు.

మనాడో, గోరోంట ప్రధాన నగరాల్లో భూమి కంపించింది. దాంతో అక్కడి ప్రజలు భయంతో బయటకు పరుగెత్తినట్లు జాతీయ విపత్తు ఏజెన్సీ ప్రతినిధి సుటోపా పుర్వో తెలిపారు. గోరోంటలోని ఓ  హోటల్ రిసెప్షనిస్ట్ తమ వద్ద దాదాపు 5 సెకండ్ల పాటు భూమి కంపించిందని చెప్పారు. అయితే తమ అతిథిలులకు ఎలాంటి యిబ్బంది తలెత్తలేదని తెలిపాడు. కాగా ఇప్పటివరకూ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదు. పసిఫిక్‌ రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌గా పిలిచే భూఫలకాలపైన ఉన్న కారణంగా ఇండోనేషియా తరచూ భూకంపాలను, అగ్నిపర్వతాల పేలుళ్ళను చవిచూస్తూ ఉంటుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement