
జుకర్ ఆ 22 పుస్తకాలు చదవాలంటున్నాడు
మీరు పుస్తకాలను చదువుతున్నారా అని ఎవరైనా అడిగితే.. అలా అడిగిందే తడవుగా నేనా పుస్తకాలా.. న్యూస్ పేపర్ చదివే సమయమే లేదుకానీ పుస్తకం చదవడమా అని అంటుంటారు.
న్యూయార్క్: మీరు పుస్తకాలను చదువుతున్నారా అని ఎవరైనా అడిగితే.. అలా అడిగిందే తడవుగా నేనా..! పుస్తకాలా..! న్యూస్ పేపర్ చదివే సమయమే లేదుకానీ పుస్తకం చదవడమా అని అంటుంటారు. ఇంకొందరైతే పుస్తకాలు చదవడం అంటే నాకు చాలా ఇష్టం కానీ బిజీ షెడ్యూల్ వల్ల వాటిని చదవలేకపోతున్నానని అంటుంటారు.
మరికొందరు ఖాళీగా ఉన్నా అసలు పుస్తకాలు చదవాలనే ఆలోచనే చేయరు. కానీ, ఆయన కొన్ని వేల కోట్లకు అధిపతి.. నేడు ప్రపంచం మొత్తాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చిన ఘనుడు, కూతురు పుట్టిందన్న సంతోషంతో తన సంపాదనలో కొంతభాగాన్ని ప్రపంచ సేవలకోసం ఖర్చుచేస్తానని ప్రకటించిన నిస్వార్థపరుడు జూకర్ బర్గ్ మాత్రం పుస్తకాలతో కుస్తీ పట్టండని సలహాలు ఇస్తున్నాడు. అవొక్కటే తనను తాను నిజంగా శోధించుకునే ఏకైక సాధనం అని ఆయన చెబుతున్నారు.
2015లో రెండు వారాలకు కనీసం ఒక పుస్తకాన్ని అయినా చదవాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆయన ఆ లక్ష్యాన్ని చేరుకున్నారు. తాను నిర్ణయించుకున్నట్లుగా మొత్తం 22 పుస్తకాలు చదివారు. మీరు కూడా అలాగే పుస్తకాలు చదవడం లక్ష్యంగా పెట్టుకొని వాటిని సాధిస్తారని ఆయన ఆకాంక్షించారు. తాను చదివిన ఈ 22 పుస్తకాలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయని మీరు కూడా చదవండంటూ ఆయన తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు. జుకర్ బర్గ్ తప్పక చదవాలని చెప్పిన 22 పుస్తకాలు ఇవే..
► ది ఐడియా ఫ్యాక్టరీ: బెల్ లాబ్స్ అండ్ గ్రేట్ ఏజ్ ఆఫ్ అమెరికన్ ఇన్నో వేషన్, రచన జాన్ గార్ట్నర్
► వరల్డ్ ఆర్డర్, రచన: హెన్నీ కిస్సింగర్
► వై నేషన్స్ ఫెయిల్: డారెన్ అకెమొగ్లు అండ్ జేమ్స్ రాబిన్ సన్
► ది రేషనల్ ఆప్టిమిస్ట్ రచయిత: మాట్ రిడ్లీ
► పోర్ట్ పోలియోస్ ఆఫ్ ది పూర్, డేరిల్ కొలిన్స్, జోనాధన్ మార్చుచ్
► ది త్రీ బాండీ ప్రాబ్లెమ్, రచన లి కిక్సిన్
► జినోమ్, మట్ రిడ్లీ
► ది ముకాద్దిమాహ్, ఐబీఎన్ ఖాల్దన్
► సెపియన్స్ , యువల్ నో హరారి
► ది వెరైటీస్ ఆఫ్ రిలీజియస్ ఎక్స్పీరియన్స్, విలియం జోన్స్
► ది న్యూ జిమ్ క్రో, మైఖెల్ అలెగ్జాండర్
► ది ఎండ్ ఆఫ్ పవర్, మోయిస్ నేయిమ్
► క్రియేటివిటీ ఇంక్, ఈడీ కాత్ముల్
► ది బెటర్ యాంగిల్స్ ఆఫ్ అవర్ నేచుర్, స్టీవెన్ పింకర్
► ఆన్ ఇమ్యూనిటీ, యులా బిస్
► ది ప్లేయర్ ఆఫ్ గేమ్స్, ఎం బాక్స్
► గ్యాంగ్ లీడర్ ఫర్ ఏ డే, సుదీర్ వెంకటేశ్
► ది స్ట్రక్చర్ ఆఫ్ సైంటిఫిక్ రెవల్యూషన్స్
► ఆర్వెల్ రివెంజ్, పీటర్ హబర్
► ఎనర్జీ: ఏ బిగినర్ గౌడ్, వాక్లావ్ స్మిల్
► డీలింగ్ విత్ చైనా, హెన్రీ ఎం పాల్స్న్
► రేషనల్ రిచువల్ బై మైఖెల్ సుక యంగ్ చ్వే