అల్జీరియా దేశానికి చెందిన సైనిక రవాణా విమానం కుప్పకూలిపోయింది. 103 మంది మరణించినట్టు సమాచారం.
అల్జీర్స్: అల్జీరియా దేశానికి చెందిన సైనిక రవాణా విమానం కుప్పకూలిపోయింది. 103 మంది మరణించినట్టు సమాచారం. తూర్పు ప్రాంతంలోని ఓయుమ్ ఈ బోవాఘీ ప్రావిన్స్లో మంగళవారం ఈ దుర్ఘటన జరిగింది.
మిలటరీ అధికారుల కుటుంబ సభ్యులను తీసుకెళ్తుండగా విమానం ప్రమాదానికి గురైంది. ఇందులో ప్రయాణిస్తున్న 103 మంది మరణించినట్టు ఆ దేశ మీడియా వెల్లడించింది. దట్టమైన మంచు, అననుకూల వాతావరణం ప్రమాదానికి కారమని భావిస్తున్నారు. ప్రమాద స్థలానికి వైద్య సహాయ బృందాలు చేరుకున్నాయి.