షాకింగ్‌ విషయాలు వెల్లడించిన యునెస్కో నివేదిక

10 Million Kids May Never Return to School After Corona Virus - Sakshi

10 మిలియన్ల మంది పిల్లలు శాశ్వతంగా చదువుకు దూరం

పారీస్‌: కరోనా వైరస్‌ ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. వైరస్‌ కట్టడి కోసం దేశాలన్ని లాక్‌డౌన్‌ విధించడంతో ఆర్థికంగా ఇప్పటికే ఎంతో నష్టాన్ని చవి చూస్తున్నాయి. అయితే కరోనా వల్ల ఆర్థికంగానే కాక విద్యాపరంగా కూడా ఎంతో నష్టం వాటిల్లిందని సేవ్‌ ది చిల్డ్రన్ సంస్థ‌ వెల్లడించింది. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల్లో దాదాపు 1.6 బిలియన్‌ మంది పిల్లలు పాఠశాలకు, యూనివర్సిటీలకు దూరమయ్యారని సంస్థ‌ తెలిపింది. ఒక తరం మొత్తం పిల్లల చదువు పాడవ్వడం మానవ చరిత్రలో ఇదే తొలిసారి అన్నది. యునెస్కో డాటాను ఆధారంగా చేసుకుని సేవ్‌ ది చిల్డ్రన్‌ ఓ నివేదిక వెల్లడించింది. ఫలితంగా 90-117 మిలియన్ల మంది పిల్లలు పేదరికంలోకి నెట్టబడతారని నివేదిక అంచనా వేసింది. కరోనా వల్ల ఏర్పడ్డ ఆర్థిక నష్టాలను భరించడం కోసం చాలా మంది పిల్లలు బలవంతంగా పనులకు వెళ్లాల్సి వస్తుందని.. బాల్య వివాహాల సంఖ్య పెరుగుతుందని నివేదిక వెల్లడించింది. అంతేకాక దాదాపు 9.7 మిలియన్ల మంది పిల్లలు పాఠశాలకు శాశ్వతంగా దూరమయ్యే పరిస్థితులు తలెత్తుతాయని నివేదిక తెలిపింది. 

అంతేకాక 2021 నాటి అన్ని దేశాల బడ్జెట్లలో విద్యకు కేటాయింపులు భారీగా తగ్గుతాయని.. ప్రపంచవ్యాప్తంగా ఈ మొత్తం 77 బిలియన్ల అమెరికన్‌ డాలర్లుగా ఉంటుందని సేవ్‌ ది చిల్డ్రన్‌ నివేదిక అంచాన వేసింది. అంతేకాక ఈ చర్యల వల్ల పేద-ధనిక, ఆడ-మగ అంతరాలు మరింత పెరుగుతాయన్నది. దీని నుంచి బయటపడటం కోసం ప్రభుత్వాలు, దాతలు పిల్లలందరికి సురక్షితమైన, నాణ్యమైన విద్యనందించేందుకు ఎక్కువ పెట్టుబడి పెట్టాలని కోరింది. ఇప్పటికే పేద, అట్టడుగు వర్గాల పిల్లలు సగం విద్యా సంవత్సరం నష్టపోయారని నివేదిక తెలిపింది. విద్యా కార్యక్రమాల కోసం దాదాపు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు 77 బిలియన్‌ డాలర్లు కేటాయించాల్సి వస్తుందని  నివేదిక అంచనా వేసింది.

ఈ విద్యా సంక్షోభం ముగియకపోతే.. పిల్లల భవిష్యత్తుపై ఆ ప్రభావం దీర్ఘకాలంగా ఉంటుందని సేవ్‌ ది చిల్డ్రన్ తెలిపింది. 2030 నాటికి పిల్లలందరికి నాణ్యమైన విద్య అందించాలనే ఐక్యరాజ్యసమితి వాగ్దానం పూర్తికాదని తెలిపింది. 12 దేశాలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉండనున్నట్లు నివేదిక వెల్లడించింది. నైజర్, మాలి, చాడ్, లైబీరియా, అఫ్ఘనిస్తాన్, గినియా, మౌరిటానియా, యెమెన్, నైజీరియా, పాకిస్తాన్, సెనెగల్‌, ఐవరీ కోస్ట్ దేశాల పిల్లలు చాలా వెనకబడిపోయే ప్రమాదం ఉందని సేవ్‌ ది చిల్డ్రన్ నివేదిక హెచ్చరించింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

06-08-2020
Aug 06, 2020, 19:16 IST
సాక్షి,తిరుపతి: తిరుమలలో విషాదం చోటు చేసుకుంది. కరోనా మహమ్మారి బారినపడి మరో అర్చకుడు మృతి చెందారు. శ్రీవారి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న...
06-08-2020
Aug 06, 2020, 16:40 IST
ఆంటిగ్వా: తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందంటూ రూమర్లు పుట్టించడంపై వెస్టిండీస్‌ దిగ్గజ క్రికెటర్‌ బ్రియాన్‌ లారా మండిపడ్డాడు. ఏదొక న్యూస్‌...
06-08-2020
Aug 06, 2020, 14:04 IST
తిరువనంతపురం: కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేసింది. వైరస్‌ వ్యాప్తి కోసం లాక్‌డౌన్‌ విధించడంతో ఎందరో ఉద్యోగాలు కోల్పోయి...
06-08-2020
Aug 06, 2020, 13:15 IST
కరోనా వైరస్‌ విషయంలో తప్పుడు సమాచారం పోస్ట్‌ చేసిన ట్రంప్‌నకు ఫేస్‌బుక్‌ షాకిచ్చింది.
06-08-2020
Aug 06, 2020, 11:42 IST
ఆనందం, బాధ, కోపం ఎలాంటి భావాలనైనా సంగీతం ద్వారా  పలికించవచ్చు. అటువంటి సంగీతంలో మానుకోటకు చెందిన బోలె షావలీ దూసుకెళ్తున్నాడు....
06-08-2020
Aug 06, 2020, 11:03 IST
తాడేపల్లిరూరల్‌: పట్టణ పరిధిలోని అంజిరెడ్డి కాలనీలో నివసించే భార్యాభర్తలు క్వారంటైన్‌ సెంటర్‌ నుంచి పరారై వచ్చారు. కాలనీలోకి వచ్చిన భార్యాభర్తలిద్దరూ...
06-08-2020
Aug 06, 2020, 09:53 IST
సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్‌ వైద్యం అత్యంత ఖరీదైపోయింది.ప్రైవేట్, కార్పొరేట్‌ ఆసుపత్రులు రూ. లక్షల్లో వసూలు చేస్తున్నాయి. సాధారణ దగ్గు, జలుబు,జ్వరం...
06-08-2020
Aug 06, 2020, 09:38 IST
బ్రెసిలియా : బ్రెజిల్‌లో కరోనా మహమ్మారి రోజురోజుకూ మరింత విజృంభిస్తున్నది. నిత్యం వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవడంతో పాటు మరణాల సంఖ్య పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది....
06-08-2020
Aug 06, 2020, 09:15 IST
నల్లగొండ జిల్లా కట్టంగూర్‌మండలపరిధిలో చోటు చేసుకున్న ఓ రోడ్డు ప్రమాదంలో 42 ఏళ్ల మహిళ తీవ్రంగా గాయపడింది. చికిత్స కోసం...
06-08-2020
Aug 06, 2020, 09:01 IST
సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు కొత్తగా 2092 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర...
06-08-2020
Aug 06, 2020, 08:30 IST
జూబ్లీహిల్స్‌: షేక్‌ హ్యాండ్‌ ఇచ్చినా కరోనా బారిన పడకుండా ఉండేలా శానిటైజ్‌ హ్యాండ్‌ గ్లౌజ్‌ను శ్రీనగర్‌ కాలనీకి చెందిన సెక్యూరిటీ...
06-08-2020
Aug 06, 2020, 08:02 IST
సాక్షి, అహ్మదాబాద్ :  గుజరాత్ లో విషాదం చోటు చేసుకుంది. ఒకపక్క  కరోనా విలయంతో దేశ ప్రజలు వణికిపోతోంటే..ఆసుపత్రిలో సంభవించిన అగ్నిప్రమాదం...
06-08-2020
Aug 06, 2020, 07:59 IST
సాక్షి, హైదరాబాద్ : ఔషధ తయారీలో ఉన్న హైదరాబాద్‌ కంపెనీ బయోఫోర్‌ ఇండియా ఫార్మాస్యూటికల్స్‌కు చెందిన జెనరా ఫార్మా.. కోవిడ్‌ చికిత్సలో...
06-08-2020
Aug 06, 2020, 07:10 IST
కదిరి: కదిరి ఎమ్మెల్యే డాక్టర్‌ పీవీ సిద్దారెడ్డి కోవిడ్‌ పాజిటివ్‌ పేషంట్లకు వైద్యం అందించారు. ఆయన ఎమ్మెల్యే అయినప్పటికీ వృత్తిరీత్యా...
06-08-2020
Aug 06, 2020, 06:25 IST
న్యూఢిల్లీ: దేశంలో వరుసగా ఏడో రోజూ 50 వేలకు పైగా కేసులు నమోదు కావడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య...
06-08-2020
Aug 06, 2020, 04:41 IST
వేలేరుపాడు: పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండలంలో ఓ 95 ఏళ్ల వృద్ధుడు కరోనా వైరస్‌ను జయించారు. జగన్నాథపురం గ్రామానికి చెందిన...
06-08-2020
Aug 06, 2020, 04:35 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 నివారణలో భాగంగా సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ...
06-08-2020
Aug 06, 2020, 04:25 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్‌ను జయించిన వారి సంఖ్య లక్ష మార్కును అధిగమించింది. గడిచిన 24 గంటల్లో 8,729...
06-08-2020
Aug 06, 2020, 01:10 IST
న్యూఢిల్లీ: ఐపీఎల్‌ షెడ్యూలుపై స్పష్టత వచ్చేసింది కానీ... దానితో ముడిపడిన ఎన్నో అంశాలపై ఇంకా గందరగోళం ఉంది. ఇందులో నిర్వహణ...
05-08-2020
Aug 05, 2020, 20:46 IST
సాక్షి, అమ‌రావ‌తి: ఆంధ‌ప్ర‌దేశ్‌లో రికార్డు స్థాయిలో క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు చేస్తున్నారు. దీంతో బుధ‌వారం కేసుల సంఖ్య మ‌రోసారి‌ ప‌ది వేలు...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top