
'సోషల్ మీడియాకు ఆ ఫుటేజీ ఎలా లభించింది'
ఆంధ్రప్రదేశ్ శీతాకాల సమావేశాల్లో జరిగిన అన్ని పరిణామాలపై సమగ్ర విచారణ జరపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కోరారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శీతాకాల సమావేశాలలో జరిగిన అన్ని పరిణామాలపై సమగ్ర విచారణ జరపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కోరారు. సోమవారం హైదరాబాద్లో అసెంబ్లీ కమిటీ హాల్లో ఆయన స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుని కలిశారు.
అనంతరం శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ...సోషల్ మీడియాకు అసెంబ్లీ సెషన్స్ ఫుటేజీ ఎలా లభించిందన్న అంశంపై విచారణ జరపాలని కోరామన్నారు. డిసెంబర్ 21వ తేదీన జరిగిన పరిణామాలపై విచారణ జీరో అవర్కే పరిమితం చేయడం సరికాదని స్పీకర్కు తెలిపామని చెప్పారు. అన్ని అంశాలను కమిటీ విచారిస్తుందని స్పీకర్ స్పష్టత ఇచ్చారని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.