కోతిబావా.. చిక్కవా! | Went out of the rare monkeys in the zoo enclosure | Sakshi
Sakshi News home page

కోతిబావా.. చిక్కవా!

May 9 2016 4:04 AM | Updated on Sep 3 2017 11:41 PM

కోతిబావా.. చిక్కవా!

కోతిబావా.. చిక్కవా!

నెహ్రూ జూలాజికల్ పార్కులో అధికారుల నిర్లక్ష్యం కారణంగా స్క్విరెల్ కోతులు ఎన్‌క్లోజర్ నుంచి బయటికి వెళ్లిపోయాయి.

 జూ ఎన్‌క్లోజర్ నుంచి బయటికి వెళ్లిన అరుదైన కోతులు
 
 హైదరాబాద్: నెహ్రూ జూలాజికల్ పార్కులో అధికారుల నిర్లక్ష్యం కారణంగా స్క్విరెల్ కోతులు ఎన్‌క్లోజర్ నుంచి బయటికి వెళ్లిపోయాయి. ఎన్‌క్లోజర్‌లో కోతులు లేకపోవడంతో సందర్శకులు యానిమల్ కీపర్లను ప్రశ్నించారు. దీంతో సిబ్బంది జూ అధికారులకు సమాచారం అందించారు. అరుదైన ఈ స్క్విరెల్ మంకీలు 200-260 గ్రాముల బరువు మాత్రమే ఉం టాయి. ఉడుత సైజులో చిన్నగా ఉండే ఈ కోతులు చెట్ల వెనకాల చేరితే గుర్తించడం కష్టం. ఈ కోతుల ఎన్‌క్లోజర్ పైభాగం ఓపెన్‌గా ఉండటం... చుట్టూ చెట్లు ఉండటంతో బయటికి జంప్ చేసి ఉంటాయని జూ అధికారులు పేర్కొంటున్నారు.

గత కొన్ని రోజులుగా ఈదురు గాలులతో భారీగా వర్షాలు కురుస్తున్నా జూ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఎన్‌క్లోజర్‌లోని మోడ్‌లో వర్షపు నీరు నిండిపోవడంతో కోతు లు అందులో ఈదుతూ అందిన చెట్టు కొమ్మలను పట్టుకొని బయటికి వచ్చాయి. ఎన్‌క్లోజర్ నుంచి బయటికి వె ళ్లిన మంకీలు ఎల్లో టైగర్ ఎన్‌క్లోజర్ చెట్లపైన ఉన్నట్లు జూ అధికారులు గుర్తించారు. వీటిని పట్టుకునేందుకు ఎన్‌క్లోజర్‌లో ఇనుప జాలీల బోన్‌ను ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement