మేయర్, కమిషనర్‌కు తప్పిన ప్రమాదం | wall collapsed in hyderabad chandralok complex after mayor, commissioner visits | Sakshi
Sakshi News home page

మేయర్, కమిషనర్‌కు తప్పిన ప్రమాదం

Dec 13 2016 3:05 PM | Updated on Sep 4 2017 10:38 PM

మేయర్, కమిషనర్‌కు తప్పిన ప్రమాదం

మేయర్, కమిషనర్‌కు తప్పిన ప్రమాదం

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, మేయర్ బొంతు రామ్మోహన్కు తృటిలో పెను ప్రమాదం తప్పింది.

సికింద్రాబాద్ : జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్కు మంగళవారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ ప్యారడైజ్ సమీపంలోని చంద్రలోక్ కాంప్లెక్సులో సోమవారం సాయంత్రం గోడ కూలి ఓ వ్యక్తి మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనా స్థలాన్ని మేయర్, కమిషనర్‌లు ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం ఉదయం పరిశీలించారు.

యాభై ఏళ్ల కిందట నిర్మించిన ఈ భవనం ఏ క్షణాన్నైనా కూలవచ్చనే అనుమానంతో భవన సముదాయాన్ని, ఆ రోడ్డును అధికారులు పూర్తిగా మూసివేశారు. అటు వైపు ఎవరూ వెళ్లొద్దంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. కాగా, మేయర్, కమిషనర్‌లు వెళ్లిన కాసేపటికే మరో అంతస్తు గోడ కుప్పకూలింది. అందరూ వెళ్లిన తర్వాత గోడ కూలడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement