ఫుట్‌పాత్‌పై అపస్మారక స్థితిలో ఉన్నవున్న ఓ గుర్తు తెలియనిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు.
ఫుట్‌పాత్‌పై అపస్మారక స్థితిలో ఉన్నవున్న ఓ గుర్తు తెలియనిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటన మార్కెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 29వ తేదీ మధ్యాహ్నం ఓ 30 సంవత్సరాల గుర్తు తెలియని వ్యక్తి ఓల్డ్‌జైల్‌ఖాన ప్రాంతంలో అపస్మారకస్థితిలో పడివున్నాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు 108 సహాయంతో అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. గుండె సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ రాత్రి ఆయన మరణించారు. అతని దగ్గర ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో మతదేహాన్ని గాంధీ మార్చురీలో భద్రపరిచారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే మార్కెట్ పోలీస్‌స్టేషన్‌లో కానీ 040-27853598, 908395689 నంబర్లను సంప్రదించాలని పోలీసులు సూచించారు.