హైదరాబాద్ లో ఉబెర్ క్యాబ్లను నిషేధించారు.
హైదరాబాద్: హైదరాబాద్ లో ఉబెర్ క్యాబ్లను నిషేధించారు. తెలంగాణ ఆర్టీఏ కమిషనర్ జగదీష్ ఈ విషయాన్ని ప్రకటించారు. బుధవారం ఉదయం నుంచి అనుమతులు లేని క్యాబ్లపై దాడులు నిర్వహిస్తామని తెలిపారు.
దేశ రాజధానిలో ఇటీవల ఓ మహిళా ఉద్యోగిపై ఉబెర్ క్యాబ్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిదే. ఈ ఘటనను కేంద్రం తీవ్రంగా పరిగణించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉబెర్ క్యాబ్ సర్వీసులను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది.