అశ్లీలం చూస్తే 'కటకటాలే '.. ఆచూకీ కనిపెడుతున్న పోలీసులు | Cybercrime police Surveillance websites | Sakshi
Sakshi News home page

అశ్లీలం చూస్తే 'కటకటాలే '.. ఆచూకీ కనిపెడుతున్న పోలీసులు

Jun 23 2025 7:14 AM | Updated on Jun 23 2025 7:14 AM

Cybercrime police Surveillance websites

 చైల్డ్‌ పోర్నోగ్రఫీపై ప్రపంచ వ్యాప్తంగా నిషేధం 

పోస్టింగ్, షేరింగ్‌తో పాటు చూడటమూ నేరమే 

ఎన్సీఆర్బీ, ఐ4సీ సమన్వయంతో కేసులకు సిఫార్సు 

చర్యలు తీసుకుంటున్న స్థానిక సైబర్‌ క్రైమ్‌ కాప్స్‌

సాక్షి, హైదరాబాద్‌: చిన్నారులపై లైంగిక దాడులు జరగడానికి, పెరగడానికి కారణమైన చైల్డ్‌ పోర్నోగ్రఫీపై ప్రపంచ వ్యాప్తంగా నిషేధం ఉంది. దీనిపై కన్నేసి ఉంచడానికి నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మిస్సింగ్‌ అండ్‌ ఎక్స్‌ప్లాయిటెడ్‌ చిల్డ్రన్ (ఎన్‌సీఎంఈసీ) పని చేస్తోంది. చైల్డ్‌ సెక్సువల్‌ అబ్యూజ్డ్‌ మెటీరియల్‌ను (సీఎస్‌ఏఎం) కనిపెట్టడానికి అత్యాధునిక సాఫ్ట్‌వేర్స్‌ వినియోగిస్తోంది. వీరు గుర్తించిన వివరాల ఆధారంగానే గత వారం సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఐఐటీ ఖరగ్‌పూర్‌ గ్రాడ్యుయేట్‌ సహా 15 మందిని అరెస్టు చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న కఠిన చట్టాల ప్రకారం ఇంటర్‌నెట్‌తో పాటు సోషల్‌మీడియాలో చైల్డ్‌ పోర్నోగ్రఫీని సెర్చ్‌ చేసినా, చూసినా, డౌన్‌లోడ్, అప్‌లోడ్‌ చేసినా నేరమే.  

నిఘా వేసి ఉంచే రెండు సంస్థలు..
చైల్డ్‌ పోర్నోగ్రఫీని ప్రపంచ వ్యాప్తంగా నిషేధించిన తర్వాత ఎన్‌సీఎంఈసీ చర్యలు ముమ్మరం అయ్యాయి. దీంతో పాటు ఇంటర్నేషనల్‌ చైల్డ్‌ ఎక్స్‌ప్లాయిటేషన్‌ (ఐసీఎస్‌ఈ), గూగుల్‌కు సంబంధించిన సైబర్‌ టిప్‌లైన్‌ రిపోర్ట్స్‌ సీఎంఏఎంని గుర్తించడానికి ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లు వాడుతున్నాయి. ప్రపంచంలో ఎవరైనా ఆయా వేదికలపై సీఎస్‌ఏఎంకు సంబంధించి ఎవరైనా సెర్చ్‌ చేసినా, వీక్షించినా, డౌన్‌లోడ్‌ చేసినా, అప్‌లోడ్‌ చేసినా..తక్షణం గుర్తించే ఈ సాంకేతిక పరిజ్ఞానం వారు వినియోగించిన ఐపీ అడ్రస్‌లను రీడ్‌ చేస్తుంది. ఈ వివరాలను ఎన్‌సీఎంఈ, ఐసీఎస్‌ఈలకు చెందిన సర్వర్‌ అందిస్తుంది. వీటిని క్రోడీకరించి జాబితాలు రూపొందించి వీటిని ఆయా దేశాలకు చెందిన నోడల్‌ ఏజెన్సీలకు అందిస్తారు. జాతీయ స్థాయిలో హోమ్‌ మంత్రిత్వ శాఖ ఆ«దీనంలోని ఐ4సీ నోడల్‌ ఏజెన్సీగా ఉంది. ఇది తమకు అందిన వివరాలను ఆయా రాష్ట్ర స్థాయి దర్యాప్తు సంస్థలకు పంపిస్తారు. ఇలా గత వారం సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోకు సమాచారం అందింది.  

నిందితుల్లో అన్ని రకాల వాళ్లూ... 
వీటిపై కేసులు నమోదు చేసి, ఐపీ అడ్రస్‌ల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేయడం సైబర్‌ బ్యూరో నిర్వర్తిస్తుంది. ఈ నిందితుల్లో విద్యాధికులు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు కూడా ఉంటున్నారు. ఇటీవల అరెస్టు అయిన వారిలో వ్యాపారులు, చిరుద్యోగి కూడా ఉన్నారు. ఇంటర్‌నెట్‌లో ఉండే పోర్న్‌ మెటీరియల్‌తో పాటే కొన్ని రకాలైన వైరస్‌లు కూడా ఉండే ప్రమాదం ఉంటుందని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెప్తున్నారు. ఈ వెబ్‌సైట్ల ద్వారా ఆయా వైరస్‌లు పంపే హ్యాకర్లు ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు హ్యాక్‌ చేసి తమ ఆధీనంలోకి తీసుకుంటారు. ఇలా వ్యక్తిగత సమాచారం, నెట్‌ బ్యాంకింగ్‌ ఖాతా వివరాలు వారికి చేరి పోర్నోగ్రఫీ బానిసలు అన్ని రకాలుగానూ నష్టపోవాల్సి వస్తుందని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు. కేవలం చైల్డ్‌ పోర్నోగ్రఫీనే కాదు..అన్ని రకాలైన అసభ్య, అశ్లీల వెబ్‌సైట్లపై ఫిర్యాదులు వచి్చనప్పుడు కేంద్ర ప్రభుత్వం వాటిని నిషేధించి బ్లాక్‌ చేయిస్తోంటే నిర్వాహకులు మరోటి తయారు చేస్తున్నారు. వీటిని హోస్ట్‌ చేస్తున్న సర్వర్లన్నీ విదేశాల్లో ఉంటుండటంతో కఠిన చర్యలు సాధ్యం కావట్లేదని పోలీసులు చెబుతున్నారు.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement