ఇద్దరిని కాపాడిన రెస్క్యూ టీం | two rescued from nanakramguda collapsed building | Sakshi
Sakshi News home page

ఇద్దరిని కాపాడిన రెస్క్యూ టీం

Dec 9 2016 6:47 AM | Updated on Sep 4 2017 10:18 PM

ఇద్దరిని కాపాడిన రెస్క్యూ టీం

ఇద్దరిని కాపాడిన రెస్క్యూ టీం

భవనం కుప్పకూలిన సంఘటనలో రెస్క్యూ టీం శిథిలాల కింద చిక్కుకున్న ఇద్దరిని రక్షించింది.

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో ఏడంతస్తుల భవనం కుప్పకూలిన సంఘటనలో రెస్క్యూ టీం శిథిలాల కింద చిక్కుకున్న ఛత్తీస్‌గడ్‌కు చెందిన ఓ మహిళ, చిన్నారిని వెలికి తీసింది. ప్రాణాలతో బయటపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

మరోవైపు శిథిలాల కింద నుంచి తమను రక్షించాలంటూ క్షతగాత్రుల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. బాధితుల్లో బొబ్బిలికి చెందిన వాచ్ మెన్ సాంబయ్య, నేతేటి పైడమ్మ, వెంకటలక్ష్మీ, నారాయణమ్మ, పోలినాయుడు, మోహన్, దుర్గారావు, శంకర్లు ఉన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. జేసీబీల ద్వారా శిథిలాలను రెస్క్యూ టీం తొలగిస్తుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement