రైలు పట్టాలపై రెండు మృతదేహాలు | Two dead bodies found dead on railway tracks | Sakshi
Sakshi News home page

రైలు పట్టాలపై రెండు మృతదేహాలు

Apr 9 2016 8:52 PM | Updated on Sep 3 2017 9:33 PM

గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు రైలు ఢీకొని మరణించారు.

కాచిగూడ: గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు రైలు ఢీకొని మరణించారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఉప్పుగూడ రైల్వే స్టేషన్ సమీపంలో లలితాబాగ్ బ్రిడ్జి వద్ద గుర్తుతెలియని వ్యక్తి (35) మృతదేహాన్ని శనివారం గుర్తించారు.

అలాగే, ఉందానగర్ - బుద్వేల్ రైల్వే స్టేషన్ల మధ్య కూడా మరో యువకుడి మృతదేహాన్ని గుర్తించగా... పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement