చోరీలు చేస్తున్న ఇద్దరు మహిళలు ఆరెస్ట్ | Two arrested in robbery case | Sakshi
Sakshi News home page

చోరీలు చేస్తున్న ఇద్దరు మహిళలు ఆరెస్ట్

Mar 23 2016 8:26 PM | Updated on Sep 2 2018 3:08 PM

ఇళ్లలోకి చొరబడి ఎయిర్ కండీషనర్లు చోరీ చేస్తున్న హోంగార్డు భార్యతో సహా మరో మహిళను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

బంజారాహిల్స్ : ఇళ్లలోకి చొరబడి ఎయిర్ కండీషనర్లు చోరీ చేస్తున్న హోంగార్డు భార్యతో సహా మరో మహిళను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36 లోని ఫ్లాట్ నంబర్ 733లో ఈ నెల 16న ఇద్దరు మహిళలు చొరబడి ఎయిర్‌కండీషన్లు చోరీచేసి వాటిని విక్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిఘా పెట్టారు. ఈనెల 21న అలగితోలు కళమ్మ (22), సంతలూరు అశ్విని అలియాస్ వెన్నెల(20) అనే మహిళలు ఏసీలు అమ్ముతున్నట్లు గమనించారు.

ఈ మహిళలను అదుపులోకి తీసుకుని విచారించగా... ఈ ఏసీలు జూబ్లీహిల్స్‌లో చోరీ చేసినట్టు వెల్లడించారు. ఫిలింనగర్‌లో దుర్గాభవానీనగర్‌లో నివసిస్తున్న వీరిద్దరూ కలిసి కొంతకాలం నుంచి చోరీలకు పాల్పడుతున్నారు. కాగా, నిందితురాలు అలగితోలు కళమ్మ భర్త పవన్ నగరంలో హోంగార్డుగా పనిచేస్తున్నట్టు తెలిసింది. కళమ్మ, అశ్వినిలను అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement